హైదరాబాద్:వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి
- October 14, 2020
హైదరాబాద్:హైదరాబాద్ లో గత రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరం అతలాకుతలమైంది. భారీగా వరద నీరు రావడంతో.. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు కాలనీలకు కాలనీలు మునిగిపోయాయి. కొన్ని చోట్ల జనం పీకల్లోతు నీళ్లలో ఇరుక్కుపోయారు. లోతట్లు ప్రాంతాల్లో పరిస్థితి ఘోరంగా ఉంది. పాతబస్తీలో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి వరద నీటిలో కొట్టుకుపోయాడు. ఎవరూ రక్షించలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆ విధంగా వరద ప్రవహిస్తోంది. నగరవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వాహనాలు కొట్టుకుపోయాయి. కొత్తగా వేసిన రోడ్లు కూడా గుంటలు పడ్దాయి. మలక్పేట, దిల్షుఖ్నగర్, ఎల్బీనగర్, నాచారం ఇలా ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని తేడాలేదు.. వర్షపునీటిలో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పనులపై బయటకు వెళ్లాలన్నా మార్గం లేక అల్లాడిపోతున్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







