ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో కొత్త ఫీచర్‌

- October 14, 2020 , by Maagulf
ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో కొత్త ఫీచర్‌

ప్రముఖ సాంకేతిక దిగ్గ‌జం ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌లో మరో ఫీచర్ ను తీసుకురానుంది.చాట్ థీమ్స్, సెల్ఫీ స్టిక్క‌ర్లు, స‌రిప‌డా ప్ర‌తిస్పంద‌న‌ల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. ఇక ఫేస్‌బుక్‌ డార్క్ మోడ్ లక్షణాన్ని కూడ విడుదల చేయనుంది.దీంతో చాట్ నుండి బయటకు వెళ్లినప్పుడు లేదా అవి చూసిన తర్వాత మెసేజ్‌లు అదృశ్యమవుతాయి.'మెసేజులు మాత్రమే పంపుకునే ద‌శ నుంచి ఫేస్‌బుక్ ఫ్రెండ్స్‌తో వివిధ యాప్‌లు, ప‌రిక‌రాల ద్వారా హ్యాంగ‌వుట్ అయ్యేందుకు నూత‌న మార్పులు వీలు క‌ల్పిస్తాయి అని' మెసెంజర్ వైస్ ప్రెసిడెంట్ స్టాన్ చుడ్నోవీస్కీ ఒక బ్లాగ్ పోస్ట్‌లో రాశారు. భవిష్యత్ మెసెజింగ్‌కు అనుగుణంగా మార్పులు ఉంటాయని ఫేస్‌బుక్ వెల్లడించింది. ఫేస్‌బుక్‌ మెసెంజర్ కొత్త లోగో కూడా నీలం రంగు నుంచి కొద్దిగా మార‌నుంది.ఇటీవల ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌తో అనుసంధానించింది.దీంతో మెసెంజ‌ర్ లేదా ఇన్‌స్టాలలో ఒకద్నాంచి మరొదానికి మెసేజులు పంపుకునే వీలుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com