టాటాస్కై యూజర్లు 2 నెలల పాటు ఉచితంగా..
- October 15, 2020
డీటీహెచ్ కంపెనీ టాటాస్కై తాజాగా తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ తీసుకువచ్చింది. రెండు నెలల పాటు ఉచితంగా టీవీ చూసే అవకాశాన్ని కల్పిస్తోంది. దీని కోసం టాటా స్కై యూజర్లు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా రీచార్జ్ చేసుకోవలసి ఉంటుంది. ఇలా చేసిన వారికి టాటా స్కై క్యాష్ బ్యాక్ అందిస్తుంది. టాటా స్కై ఈ ఆఫర్ అక్టోబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 12 నెలల సబ్‌స్క్రిప్షన్‌పై 2 నెలల రీచార్జ్ మొత్తాన్ని క్యాష్ బ్యాక్ రూపొంలో పొందొచ్చు.
అదే సమయంలో ఆరు నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే యూజర్లకు ఒక నెల రీచార్జ్ క్యాష్ బ్యాక్ రూపంలో వస్తుంది. అంటే ఏడాదికి రీచార్జ్ చేసుకుంటే రెండు నెలలు, ఆరు నెలలకు రీచార్జ్ చేసుకుంటే ఒక నెల ఉచితంగా టాటా స్కై ఛానల్స్ వీక్షించొచ్చు. ఈ ఆఫర్ పొందాలని భావించే వారు కంపెనీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే రీచార్జ్ చేసుకోవలసి ఉంటుంది. యూజర్ల అకౌంట్లలోకి క్యాష్ బ్యాక్ మొత్తం 7 రోజుల్లోగా వచ్చి చేరుతుంది. 2 నెలల క్యాష్ బ్యాక్ ప్లాన్ ఎంచుకుంటే తొలి నెల క్యాష్ బ్యాక్ 48 గంటలలోగా అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. రెండో నెల క్యాష్ బ్యాక్ 7 రోజుల్లోగా వస్తుంది. కాగా బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు కూడా ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. వీరికి నవంబర్ 30 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. కొత్త కస్టమర్లకు ఈ అవకాశం లేదు. అయితే ఇతర బ్యాంకుల కస్టమర్లకు ఒక నెల క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది.
తాజా వార్తలు
- 37 లక్షలు దాటిన చార్ ధామ్ యాత్రికుల సంఖ్య..
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్‌లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్‌పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్‌దేవ్







