సుప్రసిద్ధ కళా దర్శకులు ఆనంద సాయికి పవన్ కల్యాణ్ అభినందనలు
- October 16, 2020హైదరాబాద్:యాదాద్రి ఆలయ ముఖ్య ఆర్కిటెక్ట్, ప్రముఖ కళా దర్శకులు ఆనంద సాయి ఇటీవలే ‘ధార్మిక రత్న’ పురస్కారం అందుకున్నారు. ఈ పురస్కారం స్వీకరించిన క్రమంలో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ శుక్రవారం సాయంత్రం ఆనంద సాయిని అభినందించారు. హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఆనంద సాయిని శాలువాతో సత్కరించి – శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ నిర్మాణంలో ఎంతో నిష్టతో పాలుపంచుకోవడం ప్రశంసనీయం అన్నారు. ఆలయ నిర్మాణం, సంబంధిత వాస్తు అంశాలపై ఎంతో పరిశోధన చేసిన ఆయనకు ధార్మిక రత్న పురస్కారం దక్కడం సముచితం అని చెప్పారు. నటులు నర్రా శ్రీను ఈ సత్కారంలో పాల్గొని అబినందనలు తెలియచేశారు.
శాంతికృష్ణ సేవా సమితి ఇటీవల హైదరాబాద్ లోని బిర్లా ఆడిటోరియమ్ లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి చేతుల మీదుగా ఆనంద సాయి ‘ధార్మిక రత్న’ పురస్కారం స్వీకరించారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి