క్వారంటైన్ గడువు సమయంలోనూ దేశం విడిచి వెళ్లేందుకు కువైట్ అనుమతి
- October 18, 2020
కువైట్ సిటీ:కువైట్ చేరుకునే ప్రయాణికులు, ప్రవాసీయులకు సంబంధించి క్వారంటైన్ నిబంధనల్లో స్వల్ప సవరణలు చేసింది కువైట్ ప్రభుత్వం. కువైట్ ఆరోగ్య శాఖ జారీ చేసిన మార్గనిర్దేశకాల మేరకు సుల్తానేట్ కు చేరుకునే ప్రయాణికులు 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సి ఉంది. అయితే..సదరు ప్రయాణికుడు తాను తిరిగి తన దేశం వెళ్లాలని అనుకుంటే..వారు క్వారంటైన్ గడువు సమయంలోనూ నిరభ్యంతరంగా దేశం విడిచి వెళ్లొచ్చని తెలిపింది. దేశం విడిచి వెళ్లే ప్రయాణికుల విషయంలో ఎయిర్ పోర్టు అధికారులు ఎలాంటి అభ్యంతరాలు చెప్పొద్దని కూడా సూచించింది. అయితే..కోవిడ్ లక్షణాలు ఉంటే మాత్రం ప్రయాణానికి అనుమతించరు. ఇదిలాఉంటే..కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న 34 దేశాల నుంచి విమాన ప్రయాణాలపై విధించిన నిషేధం యధావిధిగా కొనసాగుతుంది.
--దివాకర్(మాగాల్ఫా ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- రేపు హైదరాబాద్కు ప్రధాని మోదీ..
- రోబోటిక్ హిప్ రీప్లేస్మెంట్పై హైదరాబాద్లో జాతీయ సదస్సు
- ఇరాన్ రివల్యూషనరీ గార్డ్తో సంబంధాలున్న గుంపు అరెస్ట్
- సైబర్ కేసుల దర్యాప్తులో బ్యాంకుల సహకారం ముఖ్యం: సైబరాబాద్ సీపీ
- 4 కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి..
- ప్రధాని మోదీ సభకు హైదరాబాద్లో భారీ భద్రతా ఏర్పాట్లు: సీపీ సుమతి
- తెలంగాణ ఉద్యమ సమయంలో ఐటీ కారిడార్ అంతరాయం లేకుండా కొనసాగింది
- భారత రక్షణ దళాల పగ్గాలు కొత్త చేతుల్లోకి: కీలక మార్పుల విశ్లేషణ
- మహబూలాలో ఇల్లీగల్ స్ట్రీట్ స్టాల్స్ సీజ్..!!
- రాస్ జువాయెడ్ సమీపంలో సముద్రంలో పడి వ్యక్తి మృతి..!!









