5వ రోజూ క్షేత్రస్థాయిలో సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ పర్యటన

5వ రోజూ క్షేత్రస్థాయిలో సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ పర్యటన

సైబరాబాద్: రాజేంద్రనగర్ డివిజన్ లోని పల్లె చెరువు, అప్ప చెరువు, గగన్ పహాడ్ చెరువు తదితర ప్రాంతాల పరిస్థితిని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి, ఐపీఎస్., సైబరాబాద్ డిసిపి ట్రాఫిక్ ఎస్ ఎమ్ విజయ్ కుమార్, రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్ చక్రవర్తి, చేవెళ్ల ఏసీపీ రవీందర్ రెడ్డి తదితర అధికారులు, ఎస్ఓటీ బృందంతో కలిసి వరుసగా 5వ రోజూ స్వయంగా పర్యటించి సమీక్షించారు. అలీ నగర్ , సుబాన్ కాలనీ, కింగ్స్ కాలనీలల్లోని ని ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. తక్షిణ సహాయక చర్యలుగా వారికి అవసరమైన సాయం అందించారు.

- ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ నిన్న రాత్రి కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది.  అలీ నగర్ , సుబాన్ కాలనీ, కింగ్స్ కాలనీలల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. ఇబ్బంది ఉన్నవారిని షెల్టర్ హుమ్స్ /సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులను అందస్తున్నామన్నారు.

- మొన్న కురిసిన వర్షాలకు పల్లె చెరువు కట్ట కు రెండు చోట్ల రంధ్రాలు పడగా వెంటానీ పూడ్చి వేశామన్నారు.

- అప్ప చెరువు కట్ట మరమ్మతు పనులు కొనసాగుతున్నాయన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఓల్డ్ కర్నూల్ రోడ్డు బ్రిడ్జ్ వద్ద.. బెంగళూరు జాతీయ రహదారి పైన ఒకవైపు మూసివేయడం జరిగిందన్నారు. ప్రజలు, వాహనదారులు ప్రత్యామ్నాయంగా మరోవైపు నుంచి వెళ్లాలని సూచించారు.

- రోడ్లపై నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటే.. వాహనదారులు అందులో నుంచి వాహనాన్ని నడిపే సాహసం చేయవద్దన్నారు. పోలీసులు సూచించే ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణం చేయాలన్నారు.  

- లోతట్టు ప్రాంత ప్రజలను వీలైనంత త్వ‌ర‌గా ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు వెళ్లాలంటూ ఎప్పటికప్పుడు పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ మైక్ ల ద్వారా పోలీసులు అనౌన్స్ మెంట్ చేస్తున్నామన్నారు.

- ఇప్పటికే అలీ నగర్ , సుబాన్ కాలనీ, కింగ్స్ కాలనీ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు త‌ర‌లించామన్నారు. 

- వాతావరణ శాఖ సూచనలను అనుసరించి ప్రజలంతా రానున్న రెండు, మూడు రోజుల వరకూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరమైతే తప్ప ప్రజలు ఇంటి నుంచి అనవసరంగా బయటకు రావద్దన్నారు.

- అధికారులంతా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని సహాయక చర్యలు చేపడుతున్నామన్నారు. 

- ప్రకృతి సృష్టించిన విలయంలో అధికారులు, ప్రజలంతా కలిసి కట్టుగా ముందుకు వెళ్లాలన్నారు.

Back to Top