రోజారమణి, చక్రపాణికి ఆదర్శ దంపతుల జీవిత సాఫల్య పురస్కారం - 2020
- October 18, 2020
అమెరికా:అమెరికా గానకోకిల శారద ఆకునూరి నిర్వహణలో వంశీ ఇంటర్నేషనల్ ఇండియా మరియు యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వర్చువల్ పద్దతిలో శనివారం(అక్టోబర్ 17) జరిగిన కార్యక్రమంలో స్వర్ణోత్సవ నటీమణి రోజారమణి, చక్రపాణి దంపతులకు ఆదర్శ దంపతుల జీవిత సాఫల్య పురస్కారం బహూకరించారు. వారి స్వగృహంలో తనయుడు ప్రముఖ నటుడు తరుణ్, తనయ అమూల్య తల్లిదండ్రులకు శాలువా, పుష్పగుచ్చంతో జీవిత సాఫల్య పురస్కారంతో సత్కారించారు.
ఈ సందర్భంగా హీరో తరుణ్ మాట్లాడుతూ బాల్యంలో తన తల్లి భక్త ప్రహ్లాదలో నటించి జాతీయ పురస్కారం అందుకోవడం అదే విధంగా తను కూడా అంజలి చిత్రంలో బాలనటుడిగా జాతీయ పురస్కారం అందుకోవడం జీవితంలో ఒక మధుర స్మృతి అన్నారు. వంశీ సంస్థల వ్యవస్థాపకులు శిరోమణి వంశీ రామరాజు స్వాగతం పలికిన ఈ సభలో యునైటెడ్ కింగ్డమ్ తెలుగు సమాఖ్య ట్రస్టీ డా.వీపీ కిల్లి పరిచయ వ్యాఖ్యాలు పలికారు.
సభలో పాల్గొన్న పార్లమెంట్ మాజీ సభ్యులు సినీ నటులు నిర్మాత మాగంటి మురళీమోహన్ మాట్లాడుతూ రోజారమణితో తను వస్తాడే మా బావ, భారతంలో ఒక అమ్మాయిలో నటించానని గుర్తు చేశారు. ఆమె నటన వైదుష్యాన్ని ప్రశింసించారు. ఆమెను డబ్బింగ్ కళాకారిణిగా మొట్టమొదట తానే పరిచయం చేశానని తెలిపారు. 400 చిత్రాలకు పైగా సుహాసిని, రాధా, మీనా, విజయశాంతి వంటి హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పారని తెలియజేశారు. అంతేగాక చక్రపాణి ఒరియాలో మనకు ఎన్‌టీఆర్ లాగా పౌరాణిక పాత్రల్లో నటించి ప్రశంసలందుకున్నారని అన్నారు.
రోజారమణి మాట్లాడుతూ తమ జీవితమంతా కళలకు అంకితమైందని, కళల మయమైన జీవితం ఆనందాన్ని చేకూరుస్తుందని అన్నారు. చివరగా జరిగిన సంగీత కార్యక్రమంలో రాధిక నోరి(అమెరికా), రాజేంద్రప్రసాద్(వైజాగ్) తమ గానాన్ని వినిపించారు. ఈ కార్యక్రమంలో సినీ దర్శకులు రేలంగా నరసింహారావు, తానా అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి, డా. ప్రసాద్ తోటకూర, జయశ్రీ పీసపాటి(హాంగ్ కాంగ్), విజయ గొల్లపూడి(ఆస్ట్రేలియా) ప్రసంగించారు. డా. తెన్నేటి సుధా, శైలజ సుంకరపల్లి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కార్యక్రమం ఆద్యంతం గాయని శారద ఆకునూరి తన పాటలతో మాటలతో చక్కటి వ్యాఖ్యానంతో అలరించారు.


తాజా వార్తలు
- IPL2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఘనవిజయం
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్
- యూఏఈలో ప్రత్యక్ష లేదా దూర విద్య పై మే 10న నిర్ణయం
- విదేశీ చదువులకు పావలా వడ్డీ రుణాలు..సీఎం కీలక నిర్ణయం
- పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా మళ్లీ రంగస్వామి
- ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- యూఏఈ: రెండు బాలిస్టిక్ క్షిపణులు, మూడు డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ
- ‘విజయ్ అను నేను‘ అంటూ రేపు విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం
- పని మనుషులతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
- యువతి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు









