రెడ్ మటన్ కర్రీ
- February 13, 2016
కావలసిన పదార్థాలు: బోన్‌లెస్ మటన్ - 500 గ్రా. (నాలుగు సెం.మీ. పొడవు ముక్కలుగా కట్ చేసుకోవాలి), ఆలివ్ నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఉల్లి పాయలు - తరిగినవి 150 గ్రా., వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను, మైదాపిండి - 2 టేబుల్ స్పూన్లు, కారం - 1 టేబుల్ స్పూను, టమాటాలు - తరిగినవి 2 కప్పులు, క్యాప్సికమ్ - పెద్దది ఒకటి, రెండంగుళాల ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి, పెరుగు మీది పుల్లటి మీగడ- అర కప్పు, ఉప్పు- 2 టీ స్పూన్లు, నల్లమిరియాల పొడి - అర టీ స్పూను
తయారుచేసే విధానం
పాత్రలో నూనె వేడి చేసి మటన్ ముక్కల్ని అన్ని వైపులా ఎరుపురంగు వచ్చేలా వేగించుకొని పక్కకు తీసి పెట్టాలి. అదే పాత్రలో తరిగిన ఉల్లిపాయముక్కల్ని వేసి, అవి కొంచెం బ్రౌను రంగులోకి వచ్చాక వెల్లులి పేస్టు వేయాలి. తర్వాత వేగించి పక్కనుంచిన మటన్ ముక్కల్ని కూడా అందులో వేసి బాగా కలపాలి. మైదాపిండిని, కారాన్ని కలిపి సన్నని సెగపైన నూనె తేలేవరకు ఉడికించండి. ఇప్పుడు తరిగిన టమాటాలు, ఉప్పు, మిరియాల పొడి కూడా వేసి మటన్ మెత్తబడే వరకూ ఉంచాలి. తరిగిన క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసి మరికొంత సేపు ఉడికించాలి. తయారైన ‘రెడ్ మటన్ కర్రీ’ పైన పుల్లటి పెరుగు మీది మీగడ అలంకరించి తినండి. (శాకాహారులు ఇదే వంటకాన్ని మటన్‌కు బదులుగా మీల్ మేకర్‌ను ఉపయోగించి చేసుకోవచ్చు.)
Tags :
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









