అమెరికా ఎన్నికల వేడి..ప్రముఖ శాస్త్రవేత్త పై నోరు పారేసుకున్న ట్రంప్..

- October 20, 2020 , by Maagulf
అమెరికా ఎన్నికల వేడి..ప్రముఖ శాస్త్రవేత్త పై నోరు పారేసుకున్న ట్రంప్..

అమెరికా అధ్యక్షడు డొనాల్డ్‌ ట్రంప్‌ నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ సమయంలో ఎలా మాట్లాడతారో.. ఎవరి మీద విరుచుకుపడతారో ఊహించడం కష్టం. తాజాగా ఇదే పరిస్థితి ఎదురయ్యింది. కరోనా వైరస్‌ ఎక్స్‌పర్ట్‌ ఆంథోనీ ఫౌసీ మీద తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఆయన ఓ పెద్ద విపత్తు అని.. కోవిడ్‌ విషయంలో ఫౌసీ మాటలు విని ఉంటే అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 5 లక్షలకు చేరేదని తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రారంభం అయిన నాటి నుంచి ఫౌసీ, ట్రంప్‌తో విభేదిస్తూనే ఉన్నారు. ట్రంప్‌ నిర్లక్ష్యం వల్లే అమెరికాలో 2 లక్షల పై చిలుకు మరణాలు సంబంవించినట్లు ఫౌసీ ఆరోపించారు. ఇది రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రభావం చూపనుంది. దాంతో ట్రంప్‌ ఫౌసీ మీద గుర్రుగా ఉన్నారు.

ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్‌ ‘ఫౌసీ ఒక విపత్తు. ఒక వేళ నేను అతని మాట విన్నట్లైతే.. అమెరికాలో 5 లక్షలకు పైగా కోవిడ్‌ మరణాలు సంభవించేవి. ప్రస్తుతం మహమ్మారి అదుపులోనే ఉంది. జనాలు కూడా మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టండి అంటున్నారు. ఫౌసీ లాంటి మూర్ఖుల మాటలు విని విని వారు అలసి పోయారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకరులను అనుమతించారు. ఇక రిపబ్లికన్, డెమొక్రాటిక్ ప్రెసిడెంట్ల క్రింద పనిచేయడమే కాక అమెరికాలో అత్యంత ఆరాధించబడిన శాస్త్రవేత్తలలో ఒకరైన ఫౌసీ, 79, కోవిడ్‌ వ్యాప్తిని తీవ్రంగా పరిగణించాలని కోరారు. కానీ ట్రంప్‌ ఆయన మాటలను పట్టించుకోలేదు. చివరకు స్వయంగా ఆయనే కరోనా బారిన పడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com