ధోని పై ధ్వజమెత్తిన శ్రీకాంత్
- October 20, 2020
యువ ఆటగాళ్ల ఎంపికపై చెన్నై కెప్టెన్ ధోనీ చేసిన వ్యాఖ్యలను భారత జట్టు మాజీ సారథి కృష్ణమాచార్య శ్రీకాంత్ కొట్టిపారేశాడు. జట్టులో ఆటగాళ్ల ఎంపిక తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. యువఆటగాళ్లలో కనిపించని కసి ఫామ్‌లో లేని కేదార్ జాదవ్‌లో కనిపించిందా అని ఎద్దేవా చేశాడు. ఈ విషయంలో ధోనీ వ్యాఖ్యలను తాను సమర్థించబోనని స్పష్టం చేశాడు.
సోమవారం రాత్రి రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం ధోనీ మాట్లాడాడు. ‘మా జట్టులోని కొంతమంది యువ ఆటగాళ్లలో ఆడాలన్న కసి కనిపించలేదు. అందుకే వాళ్లకు జట్టులో స్థానం కల్పించలేదు. లీగ్‌లో మిగిలిన మ్యాచుల్లో వాళ్లకు అవకాశం ఇస్తాం. ఒత్తిడి లేకుండా వాళ్లు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు’ అని పేర్కొన్నాడు.
దీనిపై స్పందించిన శ్రీకాంత్.. ‘ధోనీ గొప్ప క్రికెటర్. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే.. మ్యాచ్ అనంతరం ధోనీ చేసిన వ్యాఖ్యలను ఏమాత్రం సమర్థించను. యువ ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడం ప్రక్రియలో ఒక భాగమని ధోనీ అనడం నూరుశాతం తప్పు. జగదీశన్‌లాంటి యువఆటగాళ్లలో కనిపించని కసి కేదార్ జాదవ్, పియూష్ చావ్లాలో కనిపించిందా..? ఏదేమైనా చెన్నై తాను స్వయంగా చేసిన తప్పిదాలతోనే ఈ సీజన్‌ను లీగ్ దశలోనే ముగించబోతోంది’ అని శ్రీకాంత్ అన్నాడు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు