అమితాబ్ ఎంట్రీ..అంచనాలు పెరిగిపోతున్నాయి
- October 20, 2020
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభాస్.వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో 21వ మూవీగా విడుదల కానుంది. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేను హీరోయిన్‌గా కన్ఫర్మ్ చేసారు. తాజాగా ఈ సినిమా నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు మేకర్స్. సైన్స్ ఫిక్షన్‌గా రూపొందనున్న ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ భాగం కాబోతున్నట్లు ప్రకటించారు. “లెజెండ్ అమితాబ్ బచ్చన్ లేకుండా లెజెండరీ సినిమాను ఎలా తెరకెక్కించగలం” అంటూ ఓ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌ను రీ-ట్వీట్ చేసిన అమితాబ్ ఈ సినిమా గురించి స్పందించారు. “ఎంతో ప్రతిష్టాత్మకమైన, మైలురాయి లాంటి ఈ సినిమాలో భాగం కావడాన్ని ఓ గొప్ప గౌరవంగా భావిస్తున్నా. 50 వసంతాలను పూర్తి చేసుకుంటున్న వైజయంతీ మూవీస్‌కు అభినందనలు. ఇలాగే మరో 50 ఏళ్లను కూడా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నా” అంటూ కామెంట్ చేశారు.
అమితాబ్‌తో కలిసి నటిస్తుండడం పట్ల ప్రభాస్ కూడా సంతోషం వ్యక్తం చేశాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తయినట్లు సమాచారం. అతి త్వరలో చిత్రాన్ని సెట్స్ మీదకు తేవాలని ప్లాన్ చేస్తున్నారు. స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మాతలుగా భారీ బడ్జెట్ కేటాయించి ఈ మూవీ రూపొందించనున్నారు.
ఇందులో బాలీవుడ్ స్టార్స్ భాగం అవుతుండటంతో సినిమాపై ఉన్న అంచనాలు పెరిగిపోయాయి.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..