కేసీఆర్ పిలుపు మేరకు కదిలొచ్చిన తెలుగు సినీ ఇండస్ట్రీ
- October 20, 2020
హైదరాబాద్‌లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో అనేక కాలనీలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. జనజీనవం అస్థవ్యస్తమైంది. వేలాదిమంది నగరవాసులు నిరాశ్రయులయ్యారు. దీంతో ప్రజలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి తక్షణ సహాయం కింద 550కోట్లను కెటాయించారు. దీనికి తోడు బాధితులను ఆదుకునేందుకు ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలను ప్రకటించారు. తమ వంతు సహాయం చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ 15 కోట్ల ఆర్థికసాయం ప్రకటించారు.
ముఖ్యమంత్రి పిలుపు మేరకు తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి చిరంజీవి కోటి రూపాయల ఆర్ధిక సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. అలాగే హీరో మహేష్ బాబు రూ.కోటి రూపాయలు, నాగార్జున రూ. 50 లక్షలు, ఎన్టీఆర్ రూ. 50 లక్షలు, విజయ్ దేవరకొండ రూ.10 లక్షలు ప్రకటించారు. హరీష్ శంకర్, అనీల్ రావిపూడి చెరో రూ. 5 లక్షల చొప్పున విరాళం అందించనున్నట్లు తెలిపారు. గత వందేళ్లలో ఏనాడు లేనివిధంగా కురిసిన వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. అపార ప్రాణ, ఆస్థినష్టం జరిగింది. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ప్రృతి వైపరిత్యంతో అల్లాడిపోతున్న వారికి నావంతు సహాయంగా సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి రూపాయలు అందిస్తున్నానని చిరంజీవి అన్నారు. వీలైనంత మంది తమవంతు సహాయం అందించాలని ట్విట్టర్‌లో వెల్లడించారు. గడిచిన వంద ఏళ్లలో ఏనాడు హైదరాబాద్‌లో ఇలాంటి పరిస్థితి ఏర్పడలేదు. భారీ వర్షం కారణంగా నగరం చిగురుటాకులా వణికిపోయింది. జన జీవనం భయాందోళకు గురైంది. ఒక రకంగా చెప్పాలంటే కోస్తా ప్రాంతంలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో అలా తయారైంది. దీంతో వర్షం వస్తుందంటే చాలు నగరవాసులు భయంతో వణికిపోతున్నారు.
తాజా వార్తలు
- IPL2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఘనవిజయం
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్
- యూఏఈలో ప్రత్యక్ష లేదా దూర విద్య పై మే 10న నిర్ణయం
- విదేశీ చదువులకు పావలా వడ్డీ రుణాలు..సీఎం కీలక నిర్ణయం
- పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా మళ్లీ రంగస్వామి
- ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- యూఏఈ: రెండు బాలిస్టిక్ క్షిపణులు, మూడు డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ
- ‘విజయ్ అను నేను‘ అంటూ రేపు విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం
- పని మనుషులతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
- యువతి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు









