కరోనా యాంటీబాడీలు: మరింత కలవరపెడుతున్న పరిశోధనలు
- October 21, 2020
న్యూఢిల్లీ: కరోనా బాధితుని శరీరంలో ఆ వైరస్‌ను ఎదుర్కొనేందుకు యాంటీ బాడీలు తయారవుతాయి. అయితే కొంతకాలం తరువాత ఆ యాంటీ బాడీలు క్షీణిస్తాయి. అప్పడు ఆ బాధితునికి తిరిగి కరోనా సోకే ముప్పు ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ్ మీడియాకు తెలిపారు.
ఈ అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయిని, కొన్ని నివేదికలు బయటకు వచ్చాయని పేర్కొన్నారు. దీని ప్రకారం ఆయా వ్యక్తుల శరీరాలలో యాంటీబాడీలు వేర్వేరు అవధుల వరకూ ఉంటున్నట్లు తేలింది. కొన్ని అధ్యయనాలలో మూడు నెలల వరకూ శరీరంలో యాంటీ బాడీలు ఉంటాయని తేలగా, మరికొన్ని అధ్యయనాల్లో ఐదు నెలల పాటు యాంటీ బాడీలు ఉంటాయని వెల్లడయ్యింది. శరీరంలో యాంటీబాడీలు క్షీనించాక తిరిగి కరోనా వచ్చే అవకాశం ఉందన్నారు. యూరప్, చైనా, అమెరికా, రష్యాతో పాటు పలు దేశాలలో కరోనాతో పోరాడే యాంటీబాడీల విషయమై పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష