అమెరికా ఎన్నికల వేడి: కమలాహారిస్ ను చిక్కుల్లోపడేసిన ఫోటో
- October 21, 2020
అమెరికా ఉపాధ్యక్ష ఎన్నికలలో డెమొక్రాటిక్ అభ్యర్థిగా బరిలో ఉన్న కమలాదేవి హారిస్‌కు ఆమె మేనకోడలు పెద్ద చిక్కే తెచ్చి పెట్టారు.. నవరాత్రులను పురస్కరించుకుని దుర్గాదేవిగా కమలాహారిస్ మార్ఫింగ్ ఫోటోను మేనకోడలు ట్వీట్ చేశారు.. అమెరికాలో ఉంటున్న హిందువుల మనసు చూరగొనాలనే ఉద్దేశంతో మీనా హారిస్ మార్ఫింగ్ ఫోటో పెట్టి ఉంటారు కానీ అది బూమరాంగ్ అయ్యింది. ఆ ఫోటో చూసి అమెరికాలోని హిందూ సంఘాలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన మీనా హారిస్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. హిందు సంఘాల ఆగ్రహాన్ని చూసిన మీనా హారిస్ ఆ ట్వీట్‌ను తొలగించారు.. మీరా హారిస్ పోస్ట్ చేసిన చిత్రంలో ఏముందంటే.. దుర్గాదేవిగా కమలాహారిస్ ఉన్నారు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నేమో మహిషాసురుడిగా చిత్రీకరించారు. డెమొక్రాటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జో బైడెన్ ఏమో అమ్మవారి వాహనం సింహంగా చూపించారు.
దుర్గామాత చిత్రాలతో కమలాహారిస్ మార్ఫింగ్ ఫోటో హిందువులను తీవ్రంగా బాధపెట్టిందని, ఇలా తమ ఓట్లను గెల్చుకోవాలనుకుంటే మాత్రం అది జరగని పని అని ప్రముఖ రచయిత షెఫాలీ వైద్య ట్విట్టర్‌లో తన నిరసన తెలిపారు. అలాగే హిందూ అమెరికన్ ఫౌండేషన్కు చెందిన సుహాగ్ ఏ శుక్లా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఫోటోను మీనా సృష్టించింది కాదనీ, ఆమె ట్వీట్‌కు ముందే ఇది వాట్సప్‌లో చక్కర్లు కొట్టిందని హిందూ అమెరికన్ పొలిటికల్ యాక్షన్ కమిటీకి సభ్యుడు రిషి భుటాడా అంటున్నారు. అయినప్పటికీ తప్పు తప్పే కాబట్టి మీనా క్షమాపణలు చెప్పాల్సిందేనని చెబుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్‌లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్‌కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్‌కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం









