షార్జా టాక్సీ కోసం 50 పార్కింగ్‌ స్లాట్లు

షార్జా టాక్సీ కోసం 50 పార్కింగ్‌ స్లాట్లు

షార్జా: జుబై బస్‌ సేట్షన్‌ సమీపంలో అల్‌ జుబైల్‌ ప్రాంతంలో షార్జా టాక్సీ వాహనాల కోసం 50 పార్కింగ్‌ స్పాట్స్‌ని షార్జా మునిసిపాలిటీ కేటాయించింది. టూరిస్టులకు అలాగే రెసిడెంట్స్‌కి మరింత వీలుగా ట్యాక్సీ సర్వీసులు అందుబాటులో వుండేలా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అధికారులు చెబుతున్నారు. సార్జా ట్యాక్సీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మొహమ్మద్‌ అబ్దుల్లా అల్‌ బురైమి మాట్లాడుతూ, షార్జా మునిసిపాలిటీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ పార్కింగ్‌ స్పాట్స్‌ నిర్ణయం ఉపకరిస్తుందని ఆయన చెప్పారు. షార్జా రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీకి కూడా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, కోవిడ్‌ మెజర్స్‌ విషయంలో అథారిటీస్‌ తీసుకుంటున్న నిర్ణయాల్నీ స్వాగతించారాయన.

 

Back to Top