సంక్రాంతికి ముస్తాబయిన రానా 'అరణ్య'
- October 21, 2020
హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి తెలుగు, హిందీ, ఇతర భాషల్లో సాధించిన వరుస విజయాలతో పాన్ ఇండియా స్టార్‌గా మారారు. ఆయన నెగటివ్ రోల్ పోషించిన మునుపటి హిందీ చిత్రం 'హౌస్‌ఫుల్ 4' బ్లాక్‌బస్టర్ హిట్టయింది. ఇప్పుడు తెలుగులో 'అరణ్య' పేరుతో విడుదలవుతున్న బహు భాషా చిత్రం 'హాథీ మేరే సాథీ'తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ప్రభు సాల్మన్ డైరెక్ట్ చేసిన ఈ భారీ బడ్జెట్ మూవీ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలవనున్నది.
మంగళవారం ఆవిష్కరించిన ఒక సరికొత్త పోస్టర్, మోషన్ వీడియో ద్వారా ఈ సినిమా 2021 సంక్రాంతికి విడుదలవుతుందని చిత్ర బృందం ప్రకటించింది. ఈ పోస్టర్లో ఒక వైపు ఒక విరిగిన గోడ, రానా, విష్ణు విశాల్ కనిపిస్తుండగా, మరోవైపు ఏనుగులు కనిపిస్తున్నాయి. వృక్షాలు, అడవులను సంరక్షించమనే మెసేజ్‌ను ఈ పోస్టర్ ద్వారా ఇస్తున్నారు. 'ప్రాణాంతక మహమ్మారిపై పోరాడుతున్న మనం, స్ఫూర్తి కోసం మన అడవుల వంక దృష్టి సారించాలి. భూమికి ఊపిరితిత్తుల్లాంటి మన అరణ్యాలు.. అటవీ నిర్మూలన, పారిశ్రామికీకరణ అనే విస్తరిస్తున్న మహమ్మారితో సుదీర్ఘ కాలంగా పోరాడుతున్నాయి. వచ్చే 2021 సంక్రాంతికి, మీ సమీపంలోని థియేటర్‌కు వస్తున్న అరణ్యతో వాటిని కాపాడదాం' అని వారు పిలుపునిచ్చారు.
పోస్టర్లో పెరిగిన గడ్డంతో రానా అడవి మనిషిలాగే కనిపిస్తుండగా, విష్ణు విశాల్ తీక్షణమైన చూపులతో కనిపిస్తున్నారు. 25 సంవత్సరాలుగా అరణ్యంలో జీవిస్తున్న ఒక మనిషి కథ 'అరణ్య'. ఈ చిత్రం పర్యావరణ సమస్యలు, అటవీ నిర్మూలన సంక్షోభంపై దృష్టి పెడుతోంది. ఇందులో జోయా హుస్సేన్, శ్రియ పిల్గావోంకర్ మరో రెండు కీలక పాత్రలు పోషించారు. శంతను మొయిత్రా సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి ఎ.ఆర్. అశోక్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఇదివరకు రిలీజ్ చేసిన అరణ్య టీజర్‌కు అన్ని వేపుల నుంచీ అద్వితీయమైన రెస్పాన్స్ వచ్చింది.
తాజా వార్తలు
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!