ఆరోగ్య శాఖతో కువైట్ ఎయిర్ లైన్స్ చర్చలు..
- October 23, 2020
కువైట్ సిటీ:కువైట్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి..కువైట్ ఎయిర్ లైన్స్, జజీరా ఎయిర్ వేస్ సంస్థల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి కువైట్ కు నేరుగా విమాన సర్వీసులు నడిపేందుకు తమకు అనుమతి ఇవ్వాలన్న ఆ రెండు ఎయిర్ లైన్స్ విన్నపంపై మంత్రి ఈ సమావేశంలో చర్చించారు. కోవిడ్ 19 నేపథ్యంలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల జాబితాను సిద్ధం చేసిన కువైట్ మొత్తం 34 దేశాల నుంచి విమాన సర్వీసులను రద్దు చేసింది. ఆ 34 దేశాల నుంచి ప్రయాణికులను అనుమతించటం లేదు. కువైట్ నిషేధిత జాబితాలో భారత్ కూడా ఉంది. అయితే..ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలపై ఆంక్షలు సడలిస్తుండటంతో..నిషేధిత జాబితాలో ఉన్న ఆ 34 దేశాల నుంచి కూడా కువైట్ కు నేరుగా విమానాలు నడిపేందుకు అనుమతి ఇవ్వాలని, ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కువైట్ చేరుకోగానే ఆరోగ్య శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని విన్నవించారు. అలాగే క్వారంటైన్ గడువును కూడా 7 రోజులకు కుదించాలని సూచించారు. ఎయిర్ లైన్స్ సంస్థల ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన మంత్రి...ఇతర సాంకేతిక అంశాలను పరిశీలించి ఆ 34 దేశాల నుంచి కూడా విమాన సర్వీసులు నడుపుకునేలా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదిలాఉంటే..ప్రస్తుతం భారత్ నుంచి కువైట్ కు డైరెక్ట్ ఫ్లైట్స్ లేకపోవటంతో భారతీయులు ఇతర దేశాలకు వెళ్లి 14 రోజుల క్వారంటైన్ తర్వాత అక్కడి నుంచి కువైట్ చేరుకోవాల్సి వస్తోంది. ఎయిర్ లైన్స్ విన్నపాలను కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదిస్తే..భారత్ లో ఉండిపోయిన కువైట్ ప్రవాసీయులు నేరుగా కువైట్ చేరుకోవచ్చు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు