ఒమాన్ లో స్వల్పంగా పెరిగిన ద్రవ్యోల్భణం
- February 14, 2016
ఒమాన్ లో స్వల్పంగా పెరిగిన ద్రవ్యోల్భణం పెరుగుతుంది. గత ఏడాది డిసెంబర్ 2015 లో ద్రవ్యోల్భణం 0.10 శాతం నుంచి ఈ ఏడాది జనవరికు 0.20 శాతం పెరిగినట్లు గణాంక నమోదు మరియుసమాచార విభాగం తెలిపింది. గృహం , నీరు , విద్యుత్ ,గ్యాస్ , ఇతర ఇంధనాలు గత ఏడాది డిసెంబర్ 2015 ధరలతో సరిపోలిస్తే 2.39 శాతం ఈ ఏడాది జనవరి లో పెరిగింది. ఆహరం, ఆల్కాహాలిక రహిత పానియలపై ధర గత ఏడాదితో సరిపోలిస్తే, ఈ ఏడాది జనవరి 2016 లో 1.68 శాతం తగ్గింది. కూరగాయలు,పండ్లులలో4.25 శాతం నుంచి ఈ ఏడాది జనవరికు 9.94 శాతం తగ్గింది అదేవిధంగా, మాంసం 0.5 శాతం, చేపలు,సముద్ర ఉత్పత్తులపై 0.24 శాతం తగ్గాయి. పాలు, జున్ను, గుడ్లు పై 0.24 శాతం పెరిగింది. అలాగే రొట్టె, గోధుమ తయారీ ఉత్పత్తులపై ధరలు 0.14 శాతం పెరిగింది. నూనెలు, కొవ్వు సంబంధిత , పంచదార , జామ్ పదార్ధాలపై 0.13 శాతం ధర పెరిగింది. దుస్తులు , పాదరక్షలపై 0.18 శాతం పెరిగింది. గృహ సంబంధమైన శుబ్రపరిచే వస్తువులపై 0.81 శాతంధరలు పెరిగాయి. ఆరోగ్యం మరియు రెస్టారెంట్లు , హోటళ్ళు 0.58 శాతం, 0.19 శాతం పెరుగుదల నమోదయ్యంది. విద్య మరియు కమ్యూనికేషన్ సంబంధిత సమూహాలపై గత ఏడు నెలలుగా స్థిరంగా
ఉన్నాయని గణాంక నమోదు మరియు సమాచార విభాగం తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







