కనీస వేతనమడిగితే... ఉద్యోగాలకే ఎసరు ?
- February 14, 2016
కనీస వేతనాలు అమలు పర్చమని భారత్ కోరడంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కార్మిక విపణిలో పలు కంపెనీలు భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యపడదని కినుక వహిస్తున్నాయి. నూతన యు.ఎ.ఇ.కార్మిక చట్ట ప్రకారం విదేశీయులకు పని అనుమతి ఇచ్చేముందు యజమానితో పని ఒప్పందం సంతకం చేయాల్సిఉంది అయెతే..యు.ఎ.ఇ. నైపుణ్యం కల్గిన కార్మికులకు సైతం కనీస వేతనాల అమలు గూర్చి ప్రస్తావించలేదు. ఈ లోపాన్ని సాకుగా తీసుకొని యు.ఎ.ఇ. పలు కంపెనీల యాజమాన్యాలు నేరుగా భారత్ ప్రభుత్వాన్ని సంప్రదించి నైపుణ్యమున్న కార్మికులను తమకు కావాలని కోరుతుంది. ఈ విధంగా భర్తీ చేసుకొన్న వెళ ప్రకటించిన వేతనం కంటే తక్కువ జీతాన్ని కార్మికులకు ఇవ్వడం భరత్ ప్రభుత్వం గమనించింది. యు.ఎ.ఇ.లో పలు కంపెనీలు తక్కువ జీతంకు భారత్ కార్మికులను పని ఒప్పందం కుడుర్చుకొంటున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కార్మిక మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చేనట్లే భారత ప్రభుత్వం అనుమతి ఇస్తుందేమోనని యాజమాన్యాలు ఆశించాయి. ఈ పరిస్థితులలో భారత కార్మికులకు కనీస వేతనాలు అమలు పర్చమని భారత్ కోరడంతో ప్రస్తుతం భారత ప్రభుత్వం, యు.ఎ.ఇ. కంపెనీ యాజమాన్యాల మధ్య వేతనాల ఘర్షణ కొనసాగుతుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







