భారత్ లో తగ్గిన కరోన కేసులు
- October 25, 2020
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మధ్యలో కొన్ని రోజుల పాటు కేసులు మరణాలు రెండూ తక్కువ నమోదు కావడంతో ఇక కరోనా ఎఫెక్ట్ తగ్గినట్టేనని భావించారు. కానీ ఇప్పుడు నెమ్మదిగా కేసులు, మరణాలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా నమోదయిన కేసులతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 78 లక్షల 64 వేలు దాటింది. గడచిన 24 గంటలలో 50,129 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలానే గడచిన 24 గంటలలో దేశంలో కరోనా వల్ల మొత్తం 578 మంది మృతి చెందారు.
అలానే గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 62,077గా ఉంది. దేశంలో ఇప్పటి వరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 78,64,811 కాగా అందులో ఇప్పుడు దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 6,68,154 గా ఉన్నాయి. ఇప్పటి దాకా కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 70,78,123కి చేరింది. అలానే కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,18,534కి చేరింది. ఇక దేశంలో నిన్న 11,40,905 కరోనా పరీక్షలు చేయగా ఇప్పటిదాకా 10,25,23,469 పరీక్షలు చేసినట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు