గోల్డ్ బాండ్ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్.. రెట్టింపు లాభం
- October 26, 2020
న్యూ ఢిల్లీ:పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. ధర తగ్గినప్పుడు కొనుగోలు చేస్తే అది అవసరానికి ఆదుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం బంగారంపై పెట్టుబడి పెట్టి లాభాలు ఆర్జించేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇదే గోల్డ్ బాండ్ స్కీమ్. అ స్కీమ్ చాలా కాలం నుంచి అందుబాటులో ఉంది. 2015 నవంబర్లో గోల్డ్ బాండ్లలో డబ్బులు పెట్టిన వారికి ఇప్పుడు కలిసివచ్చింది. అప్పుడు గోల్డ్ ధర గ్రాముకు రూ.2,683గా ఉంది. ప్రస్తుతం గోల్డ్ బాండ్ ధర రూ.5135 కి చేరుకుంది.
అప్పుడు కొని పెట్టుకున్న బాండ్లను ఇప్పుడు విక్రయిస్తే దాదాపు రెట్టింపు లాభం వస్తుంది. ఐదేళ్లలో అధిక రాబడిని తీసుకువచ్చిన పసిడి బాండ్లు ధర తగ్గినప్పుడల్లా కొనుగోలు చేయడం ఉత్తమం. గోల్డ్ బాండ్లలో ముందుగా ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పుడు 90 శాతం లాభం వస్తోంది. ప్రతి ఏడాది 14 శాతం రాబడి వచ్చిందని చెప్పుకొవచ్చు. గోల్డ్ బాండ్ ధర పెరగడం మాత్రమే కాదు వాటిపై వడ్డీ కూడా వస్తుంది. వీటిపై ఏడాదికి 2.75 శాతం వడ్డీ లభిస్తుంది. గోల్డ్ బాండ్లు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతాయి. అందువల్ల వీటిని ఎప్పుడైనా అమ్మొచ్చు, కొనొచ్చు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు