ఫ్లిప్‌కార్ట్:మరలా మోగిస్తున్న ఆఫర్ల మోత..
- October 26, 2020
ఫెస్టివల్ సీజన్ వచ్చిందంటే చాలు.. ఆఫర్ల వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి ఈ కామర్స్ సంస్థలు.. ఇప్పటికే ఈకామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ప్రత్యేక ఆఫర్లు తీసుకువచ్చాయి.. ఫ్లిప్‌కార్ట్ అక్టోబర్ 17 నుంచి 21వ తేదీ వరకు బిగ్ బిలియన్ డేస్ సేల్ నిర్వహించింది.. ప్రస్తుతం దసరా స్పెషల్ సేల్ నడుస్తుండగా.. అది ఈ నెల 28వ తేదీతో ముగిసిపోనుంది.. ఇదే సమయంలో.. మరోసారి భారీ ఆఫర్లు ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్... ఈ నెల 29వ తేదీ నుంచి బిగ్ దివాలి సేల్స్ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది... ఈసారి స్మార్టఫోన్లు, లాప్‌టాప్‌లపై ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్.. మరోవైపు క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా ఉంటాయని వెల్లడించింది.
ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులు వినియోగించి మీకు కావాల్సిన వస్తువలను కొనుగోలు చేస్తే.. క్యాష్ బ్యాక్ ఆఫర్లు వర్తింపజేయనున్నారు.. ఇక, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఎస్బీఐల ద్వారా నోకాస్ట్ ఈఎంఐలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.. ఇక, వీటికి అదనంగా రాత్రి 12 గంటలకు, ఉదయం 4 నుంచి 8 గంటల వరకు ప్రత్యేకమైన డీల్స్ కూడా ఉండనున్నాయి. ఈ సేల్ 29వ తేదీ నుంచి నవంబర్ 4వ తేదీ వరకు కొనసాగనుంది. మొత్తానికి ఫెస్టివల్ సీజన్లో కస్టమర్లను ఆకట్టుకుని సేల్స్ పెంచేందుకు ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి ఈకామర్స్ సంస్థలు.
తాజా వార్తలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







