విజయదశమినాడు లాంఛనంగా ప్రారంభమైన 'థాంక్యూ'
- October 26, 2020_1603721980.jpg)
హైదరాబాద్:యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై 'థాంక్యూ' సినిమా విజయదశమిరోజున లాంఛనంగా ప్రారంభమైంది. 'ఇష్క్, మనం, 24' వంటి వైవిధ్యమైన చిత్రాలను రూపొందించిన దర్శకుడు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ ఫైనాన్సియర్ సత్య రంగయ్య క్లాప్ కొట్టారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ - "విజయ దశమి అంటే చెడుపై మంచి విజయం సాధించిన రోజు. చాలా మంచిరోజు. అందుకనే మా 'థాంక్యూ' సినిమాను ఈరోజు లాంఛనంగా ప్రారంభించాం. రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించనున్నాం. డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్, చైతన్య కాంబినేషన్లో వచ్చిన 'మనం' ఓ క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. అలాంటి కాంబినేషన్లో సినిమా అనగానే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలుంటాయో తెలిసిందే. ప్రేక్షకాభిమానులను ఆకట్టుకునేలా ఇప్పటి వరకు చూడని స్టైల్లో సరికొత్తగా నాగచైతన్యను ప్రెజెంట్ చేసేలా సినిమా ఉంటుంది. త్వరలోనే ఈ సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తాం" అని అన్నారు.
నటీనటులు:
నాగచైతన్య అక్కినేని
సాంకేతిక నిపుణులు:
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
సంగీతం: ఎస్.ఎస్.తమన్
సినిమాటోగ్రఫీ: పి.సి.శ్రీరామ్
ఎడిటింగ్: నవీన్ నూలి
నిర్మాతలు - రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి
కథ, మాటలు - బి.వి.ఎస్. రవి
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం - విక్రమ్ కె.కుమార్
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..