దసరా పండగ సందర్భంగా పూజా కార్యక్రమాలతొ ప్రారంభమైన`వాళ్ళిద్దరు`!
- October 26, 2020
హైదరాబాద్:రమేష్ ఆర్యన్, అర్జున్ మహి(`ఇష్టంగా` ఫేమ్), డాలి చావ్లా, మీనల్ మీనన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం `వాళ్ళిద్దరు`. నటుడు బ్రహ్మాజీ కీలకపాత్ర పోషిస్తున్నారు. బి. చంద్రమౌళి రెడ్డి దర్శకత్వంలో పి.సి.సి ఫిలింస్ సహాకారంతో అర్యమన్ ఫిలింస్ పతాకంపై మండ లత నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా పండగ సందర్భంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో దర్శకులు నక్కిన త్రినాధ్ రావు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నేటి నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ సందర్భంగా..
హీరో రమేష్ ఆర్యన్ మాట్లాడుతూ...
``చంద్రమౌళి గారు కథ చెప్పగానే మా అందరికీ
బాగా నచ్చి ఒక టీమ్‌లా ఏర్పడి ఇష్టంతో ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ కీలకంగా ఉంటుంది. క్రైమ్ నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్. తప్పకుండా ఒక బెస్ట్ మూవీ అవుతుందని నమ్ముతున్నాము. ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్ నుండి వస్తోన్న చిత్రమిది. మీ అందరి ఆశిర్వాదాలు కావాలి`` అన్నారు.
దర్శకుడు చంద్రమౌళి రెడ్డి మాట్లాడుతూ...
``కథకి సూట్ అవడంతోనే `వాళ్ళిద్దరు` అనే టైటిల్ పెట్టడం జరిగింది. ఈ మూవీలో ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు. ఈ రోజు నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. నాన్‌స్టాప్‌గా షూటింగ్ జరిపి సింగిల్ షెడ్యూల్‌లో సినిమాను పూర్తిచేయనున్నాం ``అన్నారు.
అర్జున్ మహి మాట్లాడుతూ... `ఇష్టంగా` తర్వాత నేను చేస్తోన్న మూడవ చిత్రమిది. ఈ మూవీలో ఒక పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాను. కచ్చితంగా ఈ సినిమాతో మంచి గుర్తింపు వస్తుందని భావిస్తున్నాను``అన్నారు.
అనంతరం హీరోయిన్స్ డాలి చావ్లా, మీనల్ మీనన్ మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి థ్యాంక్స్`` అన్నారు.
నటీనటులు:
రమేష్ ఆర్యన్, అర్జున్ మహి, డాలి చావ్లా, మీనల్ మీనన్, బ్రహ్మాజీ తదితరులు
సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రాఫర్: రఫీక్ రషీద్,
ఎడిటర్: శ్రీనివాస్ మోపర్తి,
కో-డైరెక్టర్: శ్రీకాంత్,
పిఆర్ఒ: సాయి సతీష్,
ప్రొడ్యూసర్: మండ లత,
దర్శకత్వం: బి. చంద్రమౌళి రెడ్డి.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..