మార్చ్ 12న 'సర్దార్ గబ్బర్ సింగ్' ఆడియో ఫంక్షన్...
- February 14, 2016
'సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగ్ ఒకవైపు శరవేగంగా జరుగుతున్న నేపధ్యంలో ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కు సంబంధించిన వార్తలు లీక్ అవుతున్నాయి. ప్రస్తుతం కేరళలో షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మార్చి మొదటి వారానికి షూటింగ్ పూర్తి చేసి మార్చి రెండవ వారంలో మార్చ్ 12న ఈ సినిమా ఆడియోను అత్యంత ఘనంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ వార్తలు ఇలా ఉండగా ఈ ఆడియో ఫంక్షన్ ను మెగా కుటంబ పవర్ చాటే విధంగా అత్యంత భారీ స్థాయిలో దాదాపు లక్ష మంది అభిమానుల మధ్య హైదరాదాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించడానికి అప్పుడే ఏర్పాట్లు మొదలు అయ్యాయి అన్న వార్తలు వస్తున్నాయి.1.50 కోట్ల ఖర్చుతో నిర్వహించనున్న ఈఈవెంట్ కు సంబంధించి ఇప్పటికే కొన్ని ప్రముఖ ఈవెంట్ మేనేజిమెంట్ సంస్థలతో ఈసినిమా నిర్మాత శరత్ మరార్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ చేయబోయే హంగామా ఈ ఆడియో ఫoక్షన్ కు హైలెట్ గా మారుతుందని అంటున్నారు. ఈ ఆడియో ఫంక్షన్ లో దేవిశ్రీ స్టేజ్ షో పవన్ అభిమానులకు కిక్ ఇవ్వడం ఖాయం అని అంటున్నారు. ఇప్పటికే ఈ ఆడియో వేడుకకు చిరంజీవితో పాటు మెగా కుటుంబ సభ్యులు అందరూ హాజరవుతారు అని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇంత భారీ స్థాయిలో ఈ ఆడియో వేడుకకు డబ్బు ఖర్చు పెట్టడం వెనుక ఒక బిజినెస్ సీక్రెట్ ఉంది అని అంటున్నారు. ఈ ఆడియో ఫంక్షన్ కు సంబంధించిన టెలికాస్ట్ రైట్స్ ను ఒక ప్రముఖ ఛానల్ కు భారీ మొత్తానికి అమ్మడంతో పాటుగా అనేక ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీల యాడ్స్ ను కూడ రాబట్టుకునే అవకాశంగా ఈ 'సర్దార్ గబ్బర్ సింగ్' ఆడియో వేడుక మారబోతోంది అని టాక్..
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







