ఎస్ఎంసి ఫార్మసీ స్టాఫ్‌కి ఐదేళ్ళ జైలు శిక్ష
- October 29, 2020
మనామా:ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఫైనాన్షియల్ నేరాలు అలాగే మనీ లాండరింగ్ చీఫ్ ప్రాసిక్యూటర్ మొహమ్మద్ జమాల్ సుల్తాన్ ఈ విషయాల్ని ధృవీకరించారు. నిందితుల్లో ఒకరు మహిళ, మరో ఇద్దరు పురుషులు. వీరంతా సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ (ఎస్ఎంసి) ఫార్మసీ ఉద్యోగులు. వీరికి 500 బహ్రెయినీ దినార్స్ చొప్పున జరీమానా కూడా విధించడం జరిగింది. మందుల్ని దొంగతనం చేసినట్లు నిందితులపై అభియోగాలు నిరూపించబడ్డాయి. దొంగతనానికి గురైన మందుల విలువను కూడా నిందితులు చెల్లించాల్సి వుంటుంది. గత నెలలో నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఫిమేల్ సూపర్వైజర్ సాయంతో నిందితులు దొంగతనానికి పాల్పడ్డారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ ఘటనపై విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా నిందితుల నేరం రుజువయ్యింది.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..
- ఆలస్యం చేసిన వారికి చివరి ఛాన్స్!
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!