లేబర్ మార్కెట్ అభివృద్ధికి కొత్త విధానాలను ప్రకటించనున్న సౌదీ ప్రభుత్వం
- October 29, 2020
రియాద్:లేబర్ మార్కెట్ అభివృద్ధి కోసం త్వరలోనే కొత్త విధానాలను ప్రకటిస్తామని మానవ వనరులు, సాంఘిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ప్రకటించారు. అయితే..ఆ కొత్త విధానాలు ఎలా ఉండబోతున్నాయి...ఎలాంటి సంస్కరణలకు ఊతం ఇవ్వబోతున్నాయనే విషయాన్ని కూడా వీలైనంత త్వరగా ప్రకటిస్తామని, తమ అధికారిక మాధ్యమాల ద్వారా వెలువడే ప్రకటనను మాత్రమే ప్రజలు పరిగణలోని తీసుకోవాలని సూచించారు. సౌదీ ప్రభుత్వం కార్మిక శాఖ కొత్త విధానాలు ప్రకటించటం అంటే ..దశాబ్దాల నుంచి వస్తున్న కఫాలా వ్యవస్థను రద్దు చేయటమేనంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఉద్యోగులు, కంపెనీ మధ్య కాంట్రాక్ట్ స్థానంలో కొత్త కాంట్రాక్ట్ విధానం అమల్లోకి వస్తుందని ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రచారం నేపథ్యంలోనే మానవ వనరులు, సాంఘిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది. తమ శాఖ నుంచి ఖచ్చితమైన విధానాలు ప్రకటించే వరకు ఎలాంటి ఊహాజనిత ప్రచారాన్ని మానుకోవాలని కోరింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







