ఫేస్ మాస్క్ ధరించకుండా పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన వ్యక్తికి ఏడాది జైలు శిక్ష
- October 29, 2020
మనామా:కరోనా సోకకుండా ఫేస్ మాస్క్ పెట్టుకోలేదు..పైగా ఫైన్ వేసిన పోలీసులనే కించపరిచేలా వ్యవహరించాడో వ్యక్తి. దీంతో అతనికి ఏడాది జైలు శిక్ష పడింది. నార్తర్న్ బహ్రెయిన్ లోని అల్ ముహర్రఖ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరు విధిగా ఫేస్ మాస్క్ ధరించాల్సిందేనని బహ్రెయిన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. లేదంటే జరిమానా విధిస్తామని ఇదివరకే హెచ్చరించింది. అయితే...నిందితుడు మాత్రం కోవిడ్ నిబంధనలను లెక్క చేయలేదు. మాస్క్ పెట్టుకోకుండా ఫ్రెండ్స్ కలిసి పబ్లిక్ ప్లేసులో చిట్ చాట్ చేస్తుండటంతో పోలీసులు అతన్ని వారించారు. మాస్క్ పెట్టుకోనందుకు అతనికి ఫైన్ విధించారు. అయితే..నిందితుడు మాత్రం ఫైన్ కట్టకుండా...పోలీసులను కించపరిచేలా వ్యవహరించాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని కోర్టు బోనులో నిలబెట్టారు పోలీసులు. విచారణ చేపట్టిన మైనర్ క్రిమినల్ కోర్టు నిందితుడికి ఏడాది జైలు శిక్షతో పాటు..1000 దినార్ల జరిమానా విధించింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల