యూఏఈ:భారత్ చేరుకునే ప్రయాణికులకు క్వారంటైన్ నిబంధనల్లో స్వల్ప సవరణలు
- October 29, 2020
యూఏఈ:వివిధ కారణాలతో భారత్ చేరుకునే అంతర్జాతీయ ప్రయాణీకులతో పాటు దేశీయ ప్రయాణికులకు సంబంధించి క్వారంటైన్ నిబంధనలను స్వల్పంగా సవరించారు. యూఏఈతో పాటు ఇతర దేశాల నుంచి పర్సనల్ ట్రిప్, ప్రొఫిషనల్ పనుల మీద భారత్ వచ్చే వాళ్లందరికీ కొత్త మార్గదర్శకాలు వర్తించనున్నాయి. ప్రతి రోజు ఒక్క యూఏఈ నుంచే భారత్ కు 4000 వేల మంది వెళ్తుంటారని దుబాయ్ లోని భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది. అయితే..స్వల్ప, దీర్ఘకాలిక గడువుపై భారత్ చేరుకునే వాళ్లు ర్యాపిడ్ టెస్టులు విధిగా చేయించుకోవాల్సి ఉంటుంది. నెగటీవ్ రిపోర్ట్ వస్తే హోం క్వారంటైన్ కు అనుమతిస్తారు. ఇక తమ రాష్ట్రానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కూడా మార్గనిర్దేశకాలు జారీ చేసింది. ప్రయాణికులు తమ ప్రయాణానికి కనీసం 72 గంటల ముందు https://www.spandana.ap.gov.inవెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండేందుకు సుముఖంగా ఉన్నట్లు డిక్లరేషన్ లో పేర్కొవాల్సి ఉంటుంది. ఇక ఎయిర్ పోర్టుకు చేరుకోగానే 500 రూపాయలు చెల్లించి కోవిడ్ ర్యాపిడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఒకవేళ టెస్టులో నెగటీవ్ వస్తే వారిని హోం క్వారంటైన్ లో ఉండేందుకు అనుమతి ఇస్తారు. ఆర్టీ పీసీఆర్ టెస్ట్ నెగటివ్ రిపోర్ట్ కలిగి ఉన్న ప్రయాణికులకు మాత్రం ఎయిర్ పోర్టులో ర్యాపిడ్ టెస్టుల నుంచి మినహాయింపు ఉంటుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల