డిపిఎస్ షార్జా ఫౌండింగ్ ప్రిన్సిపల్ మృతి
- October 30, 2020
షార్జా: అభా సెహగల్, యూఏఈ మాజీ రెసిడెంట్, ప్రముఖ విద్యావేత్త, ఇండియన్ కరికులం స్కూల్ డిపిఎస్ షార్జా వ్యవస్థాపక ప్రిన్సిపల్ ఇక లేరు. సెహగల్, న్యూ ఢిల్లీలో బుధవారం తుదిశ్వాస విడిచినట్లు డిపిఎస్ దుబాయ్, డిపిఎస్ షార్జా మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ కొటారీ వెల్లడించారు. 2000 నుంచి 2008 వరకు అభా సెహగల్ సేవలందించారు. ఎడ్యుకేషనిస్ట్, ఐకానిక్ ప్రిన్సిపల్‌గానే కాదు, మానవతావాదిగా కూడా ఆమె ఎంతో ఉన్నత స్థితికి ఎదిగారని కొటారి అభిప్రాయపడ్డారు. వ్యక్తిగతంగా తనకు అభా సెహగల్ మృతి తీరని లోటు అని చెప్పారు కొటారి. డిపిఎస్ షార్జా ప్రస్తుత ప్రిన్సిపల్ వందన మర్వాహ్ మాట్లాడుతూ, 1989 నుంచి తాను అభా సెహగల్‌తో అసోసియేట్ అయి వున్నాననీ, ఆమెతో తన బంధం ఎంతో ప్రత్యేకమైనదని అన్నారు. న్యూ ఢిల్లీ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ భాను శర్మ మాట్లాడుతూ, ఎనిమిదేళ్ళపాటు ఆమెతో కలిసి పనిచేసే అదృష్టం తనకు దక్కిందని అన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష