క్వారంటైన్ కండిషన్స్ ఉల్లంఘన: పలువురి అరెస్ట్
- October 30, 2020
దోహా :హోం క్వారంటైన్ నిబంధనల్ని ఉల్లంఘించిన 10 మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు సంబంధిత అథారిటీస్‌కి చెందిన అధికారులు పేర్కొన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకోసం అథారిటీస్ ఖచ్చితంగా నిబంధనల్ని అమలు చేస్తోన్న విషయం విదితమే. నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు తప్పవని అథారిటీస్ హెచ్చరిస్తున్నా, కొందరు ఉల్లంఘనలకు పాల్పడుతూనే వున్నారు. తాజాగా అరెస్ట్ అయినవారిలో అలి అహ్మద్ ఇబ్రహీం అహ్మద్ అల్ మన్సౌరి, హని హాసన్ మొహ్మద్ గాద్, రద్వాన్ మొహమ్మద్ అల్ సలెహ్ బహియా, అబ్దుల్లా ఫైసల్ యుసెఫ్ మొహమ్మద్ బెహ్‌జాద్, ముబారక్ ఖలీఫా ముబారక్ అల్ నఫైహి అల్ కుబైసి, అబ్దుల్లా మొహమ్మద్ హిక్మత్ జహిద్ అల్ బెత్రాని, ముహమ్మద్ షరీఫ్ అల్ ఇస్లాం, అలి జమిల్ ముహమ్మద్ ఇమామ్దిన్, నబిజ్ సికందర్ తదితరులున్నారు. హోం క్వారంటైన్ నిబంధనల ఉల్లంఘనని ఉపేక్షించే ప్రసక్తే లేదని అథారిటీస్ మరోసారి హెచ్చరించాయి.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







