ఓమన్ లోని సీబ్ లో అగ్నిప్రమాదం..దగ్థమైన కారవ్యాన్
- October 30, 2020
మస్కట్: ఒమన్ లోని సీబ్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కొన్ని నివాస సముదాయాల షెడ్డులో(కారవ్యాన్) భారీగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించాయి. అయితే..అగ్నిమాపక సిబ్బందికి ఘటనపై సమాచారం అందగానే సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. సీబ్ పరిధిలోని అల్ మాబిల్లాలో ప్రమాదం జరిగినట్లు సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అధికారులు తెలిపారు. మస్కట్ గవర్నరేట్ నుంచి అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారని, ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎవరికి గాయాలు కాలేదని వెల్లడించారు.
తాజా వార్తలు
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!