ప్రియమణి ఈ ఏడాది పెళ్లి చేసుకోనుంది
- February 15, 2016
అందాలతార అసిన్ గత నెలలోనే పెళ్లి చేసుకుని స్థిరపడిపోగా ఇప్పుడు మరో హీరోయిన్ కూడా పెళ్లికి రెడీ అవుతోంది. తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా అలరించిన ప్రియమణి ఈ ఏడాది పెళ్లి చేసుకోనుంది. బోయ్ ఫ్రెండ్ ముస్తఫా రాజ్‌ను తాను పెళ్లాడనున్నట్లు ఓ టీవీ కార్యక్రమంలో స్వయంగా వెల్లడించింది. ముస్తఫారాజ్ ను మొదటిసారి ఓ డ్యాన్స్ షోలో కలిశానని, తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారిందని ప్రియమణి తెలిపింది. ముస్తఫారాజ్ ముంబైలో ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థలో పనిచేస్తున్నట్లు సమాచారం.అన్నీ అనుకున్నట్టు కుదిరితే ఈ ఏడాది చివరలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపింది. పెళ్లి తర్వాత సినిమాల్లో నటించేందుకు తనకు అభ్యంతరం లేదని, మంచి స్క్రిప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తానని చెప్పింది.తెలుగుతో పాటు పలు భాషల్లో విజయవంతమైన సినిమాల్లో నటించిన ప్రియమణి తమిళంలో నటించిన 'పరుత్తివీరన్' సినిమాకుగాను జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







