పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న'మెరిసే మెరిసే'
- October 31, 2020
హైదరాబాద్:కొత్తూరి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత వెంకటేష్ కొత్తూరి నిర్మిస్తోన్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ''మెరిసే మెరిసే''. ఈ చిత్రంలో హుషారు ఫెమ్ దినేష్ తేజ్ హీరోగా నటిస్తుండగా శ్వేతా అవస్తీ హీరోయిన్ గా నటిస్తోంది. కామెడీ, లవ్, ఎమోషన్స్ తో కూడిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.
ఈ సందర్భంగా దర్శకుడు పవన్ కుమార్.కె మాట్లాడుతూ...
మెరిసే మెరిసే మూవీ చాలా బాగా వచ్చింది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఇటీవల విడుదలైన మా సినిమా థీమ్ పోస్టర్, ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ లభించింది. త్వరలోనే ఈ సినిమాలోని పాటలను విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాము. హీరో దినేష్, హీరోయిన్ శ్వేతా అవస్తి బాగా నటించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మా సినిమా ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుందని తెలిపారు.
నిర్మాత వెంకటేష్ కొత్తూరి మాట్లాడుతూ...
సినిమా ఔట్ పుట్ బాగా వచ్చింది. సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించాం. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాము. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ సినిమా ఉండబోతోంది. మా మూవీకి మీ అందరి సపోర్ట్ కావాలని అన్నారు.
నటీనటులు:
దినేష్ తేజ్, శ్వేతా అవస్తి, సంజయ్ స్వరూప్, గురు రాజ్, బిందు, సంధ్య జనక్, మని, కాటలిన్, శశాంక్, నానాజీ.
సాంకేతిక నిపుణులు:
బ్యానర్: కొత్తూరి ఎంటర్త్సైన్మెంట్స్
నిర్మాత: వెంకటేష్ కొత్తూరి
దర్శకత్వం: పవన్ కుమార్. కె
కెమెరామెన్: నగేష్ బన్నెల్
సంగీతం: కార్తిక్ కొడగండ్ల
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







