కువైట్‌కు విమాన సర్వీసులు పెంచనున్న : ఎయిర్ ఇండియా
- February 15, 2016
ఎయిర్ ఇండియా నిర్వహిస్తున్న చౌక విమాన సర్వీసు అయిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్(ఏఐఈ)లను సేవలను మరింతగా విస్తరించాలని నిర్ణయించింది. కేరళ నుంచి మధ్య ప్రాచ్య దేశాలకు నడుపుతున్న ఈ సర్వీసులను విస్తరించనున్నట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఇందులో భాగంగా కోజికోడ్ నుంచి కేరళకు వారంలో మూడు రోజులు నడుపుతున్న సర్వీసులను ఇకనుంచి ఐదురోజులకు పెంచనుంది. ప్రస్తుతం కోజికోడ్-కువైట్ రూట్‌లో మంగళవారం, గురువారం, ఆదివారం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. వీటిని వారానికి ఐదుసార్లకు పెంచనున్నారు. మరో ఆరు బోయింగ్ 737-800 విమానాలతో తమ సర్వీసులను విస్తరించేందుకు ఎయిర్ ఇండియా ప్రణాళిక సిద్ధం చేసింది. మరో తొమ్మిది నెలల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. అలాగే కోచి నుంచి డామన్, రస్ అల్-ఖైమా, కోజికోడ్‌లకు రెండు నూతన సర్వీసులను ప్రవేశపెట్టనుంది. వీటితో కలిసి కేరళ నుంచి మధ్యప్రాచ్యానికి ఎయిర్ ఇండియా నడుపుతున్న విమానాల సంఖ్య 11కు చేరనుంది. అంతేకాక టూటైర్ నగరాలైన అమృత్‌సర్, చండీగఢ్, లక్నో, వారణాసి, జైపూర్, మధురైల నుంచి వివిధ ఆసియా దేశాలకు విమానాలు నడిపాలని ఎయిర్ ఇండియా ప్రణాళిక రచిస్తోంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







