మున్మందు రైల్వే ప్రయాణం మరింత సుఖవంతం..
- February 15, 2016
మున్మందు రైల్వే ప్రయాణం మరింత సుఖవంతంగా మారనుంది. మునుపెన్నడు లేని సౌకర్యాలు రైలు బోగీల్లో అందుబాటులోకి రానున్నాయి. కొత్తగా స్మార్ట్ కోచ్ లను తీర్చిదిద్దుతున్నారు. ఇవి పూర్తయి వినియోగంలోకి వస్తే అచ్చం ఇంట్లో ఎలాంటి సౌకర్యాలు అందుతాయో అలాంటివి వీటిల్లోను లభ్యం కానున్నాయి. ఈ స్మార్ట్ బోగీల్లో ఉండే సౌకర్యాలు పరిశీలిస్తే ప్రస్తుతం ఉన్న సీటింగ్ సిస్టం కన్నా అత్యాధునిక పరికరాలతో సీట్లు తయారు చేయనున్నారు.జీపీఎస్, వైఫైవంటి సౌకర్యాలతోపాటు నిద్రనుంచి మేల్కొనెలా అలారం గడియారాలు, ఎల్ఈడీ ఆధారిత రిజర్వేషన్ నోటీసు బోర్డులు, బెర్త్ ఇండికేటర్స్, విమానాల్లో ఏర్పాటుచేసినట్లుగా ప్రయాణికుడి పూర్తి సమాచారంతోపాటు ఆడియో రూపంలో ఎనౌన్స్ మెంట్ కూడా చేయడం జరుగుతుంది.దీంతోపాటు టీ, హాట్ వాటర్, కాఫీవంటి పానియాలకోసం ప్రత్యేకంగా వెండింగ్ మెషిన్ కూడా ఉండనుంది. దీంతోపాటు ప్రతిఒక్క ప్రయాణికుడికి ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్ చార్జింగ్ పాయింట్లు అందుబాటులోకి తీసుకురానున్నారు. సీసీటీవీ నిఘా కూడా ప్రవేశపెట్టనున్నారు. ఈ కోచ్ ల నిర్మాణం ప్రతిపాదనలు ఈ రైల్వే బడ్జెట్ లోనే ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







