ఫుల్ బిజిగా ఉన్న హీరో ఒక్క నారా రోహిత్ ...
- February 15, 2016
ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోలు అంతా సినిమాలను ఆలోచించి చేస్తున్నారు. అంటే ఒకమూవీలో నటించాలంటే ఆ డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్టార్ కాంబినేషన్ వంటివి ఎన్నో ఆలోచించి అప్పుడు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే ఒక్క హీరో మాత్రం ఇటువంటి ఆలోచిస్తూనే వెంట వెంటనే నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అంతే వేగంగా వరుస సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటూ వెళుతున్నాడు. అతనే నారా రోహిత్. ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని హీరోలందరి కంటే ఫుల్ బిజిగా ఉన్న హీరో ఒక్క నారా రోహిత్ మాత్రమే. చేతిలో ఈ హీరోకి దాదాపు పది చిత్రాలు వరకూ ఉన్నాయి. ఏప్పడు ఏ సినిమా చేస్తున్నాడో? అనేది అభిమానులు సైతం కనుక్కోవటం కష్టంగానే ఉందట.అయితే నారారోహిత్ చేతిలో ఉన్న సినిమాలు అన్నీ విడుదలయ్యే సినిమాలేనా అంటే కచ్ఛితంగా విడుదల అయ్యే సినిమాలే అని అంటున్నారు. ఇప్పటి వరకూ నారారోహిత్ నటించిన సినిమాలకి నిర్మాతలు ప్రాఫిట్ లోనే ఉన్నారని అంటున్నారు. మూవీ తక్కువ బడ్జెట్ లో పూర్తవ్వటమే కాకుండా, అభిమానులు సైతం ఈ హీరోకి ఓ ప్రత్యేక వర్గం అంటూ ఏమి లేదు. అన్ని రకాల ప్రేక్షకులు ఈ హీరో మూవీకి రావటం అనేది నారా రోహిత్ కి ప్లస్ అని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే కొన్ని మూవీలు పోస్ట్ ప్రొడక్షన్ పనులని పూర్తి చేసుకొని, విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. మరి కొన్ని మూవీలు శరవేగంగా షూటింగ్ ని పూర్తి చేసుకుంటున్నాయి. శంకరా మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది. పండగలా వచ్చాడు మూవీ సైతం రిలీజ్ కావాల్సి ఉంది. ఇక సావిత్రి మూవీ ఈ సమ్మర్ లో విడుదల అవుతుంది. అలాగే అప్పట్లో ఒకడుండేవాడు సినిమా సైతం షూటింగ్ ని జరుపుకుంటుంది. ఇక తుంటరి మూవీ సైతం రిలీజ్ కి రెడీగా ఉంది. రాజా చేయి వేస్తే సినిమా సైతం షూటింగ్ కి రెడీ అవుతుంది. ఇలా రోహిత్ చేతిలో పది మూవీల వరకూ ఉండటంతో ఇన్ని మూవీలను ఈ హీరో ఏవిధంగా మేనేజ్ చేస్తున్నాడు అనేది యంగ్ హీరోలకి ఏ మాత్రం అర్ధం కావటం లేదంట.
తాజా వార్తలు
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్డులో గ్యాస్ సిలిండర్ పేలుడు..ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
- రోడ్డు ప్రమాద బాధితులకు దుబాయ్ పోలీసుల మానవతా అండ..
- దుబాయ్ తొలి తెలుగు కాన్సుల్ జనరల్‌తో సందీప్ మక్తాల బృందం భేటీ
- జె.సి.బోస్ గ్రాంట్ మూడోసారి అందుకున్న ప్రొఫెసర్ వి.రామ్‌గోపాల్ రావు
- కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి బీమా చెక్కు అందజేసిన డీజీపీ సి.వి.ఆనంద్
- 'మన అమరావతి' థీమ్‌తో స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026
- యూఏఈ సంస్కృతిని అవమానించే కంటెంట్ పై కఠిన చర్యలు..
- ఎంపీ బాలశౌరి ప్రశ్న పై స్పందించిన కేంద్ర ప్రభుత్వం
- డల్లాస్‌లో ఘనంగా ఎస్. జానకి సంగీత నివాళి కార్యక్రమం







