అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్..
- February 15, 2016
రాజకీయాలకతీతంగా అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. సిరిసిల్ల పర్యటనలో భాగంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎల్లారెడ్డిపేటలో మోడల్ బంజారా భవన్‌ను నిర్మిస్తామని తెలిపారు. వరంగల్ జిల్లాలో గంగదేవిపల్లి ఎంత ఆదర్శంగా ఉందో మనం తలుచుకుంటే సిరిసిల్ల నియోజకవర్గాన్ని అంత ఆదర్శంగా తీర్చిదిద్దవచ్చు అని చెప్పారు. ప్రతి గ్రామం, ప్రతి తండాలో అర్హులైన వారందరికి డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. సీఎం కేసీఆర్ సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారని స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే పన్ను వసూళ్లలో సిరిసిల్ల ఆదర్శంగా ఉందని పేర్కొన్నారు. కరెంట్ కోతలు లేకుండా ప్రతి రెండు గ్రామాలకు సబ్‌స్టేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.రైతులకు పగటిపూట 9 గంటల విద్యుత్ అందిస్తామని తెలిపారు. అభివృద్ధికి ఎంత ఖర్చైనా వెనకాడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. వర్షాలు కురవాలని మనమంతా దేవుడిని ప్రార్థించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







