రాజ్‌త‌రుణ్ హీరోగా చిత్రం ప్రారంభం

- November 03, 2020 , by Maagulf
రాజ్‌త‌రుణ్ హీరోగా చిత్రం  ప్రారంభం

హైదరాబాద్:యువ క‌థానాయ‌కుడు రాజ్‌త‌రుణ్ హీరోగా శాంటో ద‌ర్శ‌క‌త్వంలో కొత్త చిత్రం మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. డ్రీమ్ టౌన్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్‌పై నంద్‌కుమార్ అభినేని, భ‌ర‌త్ మ‌గులూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వ‌ర్షా బొల్ల‌మ్మ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సంద‌ర్భంగా...

నిర్మాత‌లు నంద్‌కుమార్ అభినేని, భ‌ర‌త్ మ‌గులూరి మాట్లాడుతూ - ``రాజ్‌త‌రుణ్‌గారితో మా బ్యాన‌ర్‌లో సినిమా చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. డైరెక్ట‌ర్ శాంటో చెప్పిన క‌థ న‌చ్చింది. అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా సినిమాను రూపొందిస్తాం. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ప్రారంభిస్తాం. ఆ వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం`` అన్నారు. 

ద‌ర్శ‌కుడు శాంటో మాట్లాడుతూ - ``రాజ్‌త‌రుణ్ హీరోగా న‌టిస్తున్న 15వ సినిమా ఇది. ఆయ‌న్ని కొత్త యాంగిల్‌లో ప్రెజంట్ చేస్తూ అంద‌రినీ ఆక‌ట్టుకునే ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌లా సినిమా ఉంటుంది. నిర్మాత‌ల‌కు థాంక్స్‌. త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ‌తాం`` అన్నారు. 
 

న‌టీన‌టులు:

రాజ్‌త‌రుణ్‌, వ‌ర్షా బొల్ల‌మ్మ‌, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  శాంటో
నిర్మాత‌లు: నంద్‌కుమార్ అభినేని, భ‌ర‌త్ మ‌గులూరి
సంగీతం:  స్వీక‌ర్ అగ‌స్తి
సినిమాటోగ్ర‌ఫీ: శ‌్రీరాజ్ ర‌వీంద్ర‌న్‌
కాస్ట్యూమ్ డిజైన్‌:  అర్చ‌నా రావ్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: ఉద‌య్‌, ర‌వీన‌
ఎడిట‌ర్‌:  శ్ర‌వ‌ణ్ క‌టిక‌నేని

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com