మస్కట్: ప్రవాస కార్మికులకు గుడ్ న్యూస్...మూడు రోజుల్లోనే లేబర్ పర్మిట్

- November 04, 2020 , by Maagulf
మస్కట్: ప్రవాస కార్మికులకు గుడ్ న్యూస్...మూడు రోజుల్లోనే  లేబర్ పర్మిట్

మస్కట్:ఒమన్ లోని ప్రవాస కార్మికులు లేబర్ పర్మిట్ల కోసం ఇక వారాల తరబడి ఎదురు చూసే ప్రయాస తప్పింది. ఇక నుంచి కేవలం 3 రోజుల్లోనే లేబర్ పర్మిట్ లభించనుంది. గతంలో లేబర్ పర్మిట్ కావాలంటే దాదాపు రెండు వారాలకుపైగా సమయం పట్టేది.  ఈ మేరకు ఈ-గవర్నెన్స్ ప్రమోట్ చేయటంలో భాగంగా చేపట్టిన విధానం ద్వారా కార్మికుల పర్మిట్ జారీ వ్యవస్థ గడువు భారీగా తగ్గింది. లేబర్ పర్మిట్ జారీ ప్రక్రియ మరింత తేలిక కావటం దేశ శ్రామిక శక్తి లోటు లేకుండా ఉపకరిస్తుందని అధికారులు వెల్లడించారు. ఇది దేశ వాణిజ్య పురోభివృద్ధికి దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ-గవర్నెన్స్ ద్వారా 26 సంస్థలు అనుసంధానించబడ్డాయని...ఆయా సంస్థల నుంచి తమకు కావాల్సిన డాక్యుమెంట్లను కావాల్సిన వెంటనే యాక్సెస్ చేసుకోవటానికి వీలు కలుగుతుంది. దీంతో డాక్యుమెంట్లను తీసుకొని సంబంధిత కార్యాలయాలకు భౌతికంగా వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. తక్కువ సమయంలో డాక్యుమెంటేషన్ పూర్తవుతుంది. అదే కార్మికులకు ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగనున్నాయి. ఇదిలాఉంటే మస్కట్, సోహర్, ధోఫర్ మున్సిపాలిటిల అనుసంధానం కూడా పూర్తి అయ్యిందని అధికారులు తెలిపారు. కోవిడ్ 19 నేపథ్యంలో ప్రజలు ఆఫీసుల చుట్టు తిరక్కుండా ఈ-గవర్నెన్స్ ద్వారా తమకు సేవలను పొందె అవకాశం ఉంటుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com