భారత్ లో కరోనా తగ్గుముఖం
- November 04, 2020
భారత్ లో కరోనా విజృంభణ నెమ్మదిగా తగ్గుతోందని భావిస్తూ వచ్చాం. కొన్ని రోజుల పాటు కేసులు మరణాలు రెండూ తక్కువ నమోదు కావడంతో ఇక కరోనా ఎఫెక్ట్ తగ్గినట్టేనని భావించారు. కానీ మళ్ళీ నెమ్మదిగా కేసులు, మరణాలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం గడచిన 24 గంటలలో 46,253 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలానే గడచిన 24 గంటలలో దేశంలో కరోనా వల్ల మొత్తం 514 మంది మృతి చెందారు.
అలానే గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 53,357గా ఉంది. దేశంలో ఇప్పటి వరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 83,13,876 కాగా అందులో ఇప్పుడు దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 5,33,787గా ఉన్నాయి.ఇప్పటి దాకా కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 76,56,478కి చేరింది. అలానే కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,23,611కి చేరింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







