అర్నబ్ గోస్వామి అరెస్టు...
- November 04, 2020
ప్రముఖ న్యూస్ ఛానెల్ రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. ఈరోజు (బుధవారం) ఉదయం అర్నబ్ ను అరెస్టు చేసినట్టు తెలుస్తున్నది. ఒక ఆత్మహత్య కేసుకు సంబంధించిన విషయంపై ఆయనను అరెస్టు చేసినట్టు సమాచారం. గత కొద్దికాలంగా అర్నబ్, మహారాష్ట్ర ప్రభుత్వంపై, ముంబయి పోలీసులపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత విమర్శల వేగం పెంచాడు. ఆయన ఛానెల్ లో ప్రతిరోజు దీనిపై చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే.
కాగా ఆత్మహత్య (సుశాంత్ ది కాదు) కేసుకు సంబంధించి మరింత విచారణ నిమిత్తమే ఆయనను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. విచారణ నిమిత్తం ఆయనను రాయ్‌గడ్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు తెలుస్తున్నది. అక్కడే ఆయనను విచారిస్తున్నారు. ఈరోజు ఉదయం సుమారు పది మందికి పైగా అర్నబ్ ఇంటికి వచ్చిన పోలీసులు.. ఆయనన అదుపులోకి తీసుకున్నారు.సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు తర్వాత.. ముంబయి పోలీసులపై..
బాలీవుడ్ పై.. మహారాష్ట్ర ప్రభుత్వంపై ఆయన వరుసగా విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో అర్నబ్ పెద్ద టీఆర్పీ కుంభకోణానికి పాల్పడ్డారని పోలీసులు తేల్చారు. రిపబ్లిక్ టీవీతో పాటు మరో రెండు మరాఠీ ఛానెల్స్ పైనా కేసు నమోదైంది. పలువురికి డబ్బులిచ్చి మరీ టీఆర్పీలు పెంచుకుంటున్నారని రిపబ్లిక్ టీవీపై ఆరోపణలు నమోదైన విషయంవిదితమే. అయితే పోలీసులు తాజాగా అర్నబ్ ను పాత కేసులో అరెస్టు చేసినా.. తర్వాత దీనిని కూడా ముందుకు తీసుకొస్తారనే గుసగుసలు మీడియా సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







