'ఖుషి' ఎడిటర్ కన్నుమూత
- November 04, 2020
తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసిన కోలా భాస్కర్(55) కన్నుమూశారు. గత కొంతకాలంగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. 'ఖుషి', '7/జీ బృందావన్ కాలనీ', 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే', '3', 'కుట్టి' వంటి చిత్రాలకు ఆయన ఎడిటర్‌గా పనిచేశారు. సెల్వ రాఘవన్‌తో మంచి సాన్నిహిత్యం కలిగిన కోలా భాస్కర్.. ఆయన తీసిన పలు చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేశారు.
ఇక ఆయన కుమారుడు కోలా బాలకృష్ణ సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రూపొందిన మాలై నేరతు మయక్కమ్(తెలుగులో నన్ను వదిలి నీవు పోలేవుతే) అనే మూవీ ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీని కోలా భాస్కర్ నిర్మించారు. మరోవైపు ఆయన మరణంపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. కోలా భాస్కర్ ఆత్మకు శాంతి కలగాలంటూ కోరుకుంటున్నారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..