ఆపరేషన్ ముస్కాన్ పై వెబినార్..పాల్గొన్నహోం మంత్రి, డీజీపీ గౌతమ్‌

- November 04, 2020 , by Maagulf
ఆపరేషన్ ముస్కాన్ పై వెబినార్..పాల్గొన్నహోం మంత్రి, డీజీపీ గౌతమ్‌

గుంటూరు: ఆపరేషన్ ముస్కాన్ పై నిర్వహించిన వెబినార్‌ లో హోం మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్‌ సవాoగ్ లు పాల్గొన్నారు. వారితో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు అనురాధ, కృత్తికా శుక్లా, దీపికా పాటిల్, పోలీస్ అధికారులు, అన్ని జిల్లాల నుండి న్యాయ, కార్మిక శాఖ, వివిధశాఖల  అధికారులు హాజరయ్యారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా  బాలల  కార్మికుల విముక్తి కోసం ఆపరేషన్  ముస్కాన్ నిర్వహించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ  వినూత్న రీతిలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోను పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో జరుపుకున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంవత్సరం అక్టోబర్ 21 నుండి అక్టోబర్ 31 వరకు జరిపిన  పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను విభిన్నంగా నిర్వహించారు. వారోత్సవాలుతోపాటు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రత్యేకంగా  ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని చేపట్టింది ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖ. 10 రోజుల పాటు చేపట్టిన ఈ ఆపరేషన్‌ ముస్కాన్ లో 16 వేల మంది బాల బాలికలను  గుర్తించి సంరక్షించినట్లు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. ప్రభుత్వం అందించే అన్ని కార్యక్రమాలు బాలలకు అందించాలని హోంమంత్రి సుచరిత అన్నారు. బాలల సంరక్షణ కోసం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. నేటి బాలలు రేపటి పౌరులు అనేది పాత నినాదమని...నేటి వీధి బాలలే రేపటి ఉన్నత విద్యావంతులు అన్నది నేటి విధానమని సురచరిత అన్నారు.  ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, జునైల్ జస్టిస్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com