హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కోవిడ్ టెస్టింగ్ ల్యాబ్‌ను ప్రారంభించిన మంత్రి ఈటల
- November 04, 2020
హైదరాబాద్:ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణం కల్పించే దిశగా తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ నేడు జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కోవిడ్ టెస్టింగ్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఈ పరీక్షా కేంద్రం వల్ల నగరానికి వచ్చే దేశీయ కనెక్టింగ్ విమానాలు లేదా ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణీకులు సురక్షితంగా ప్రయాణించడానికి దోహదపడుతుంది.
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య నిబంధనల ప్రకారం, దేశంలోనికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులందరికీ బయలుదేరే ప్రదేశంలో తీసుకున్న (బయలుదేరే సమయానికి 96 గంటలలోపు) లేదా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు చేసిన నెగిటివ్ RT-PCR రిపోర్టు ఉండాలి. వెళుతున్న గమ్యస్థానంలో నెగిటివ్ RT-PCR రిపోర్టు కావాల్సిన ప్రయాణీకులు కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు.
దీని కోసం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మ్యాప్‌మైజెనోమ్, ICMR మరియు NABL సర్టిఫైడ్ ల్యాబ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ల్యాబ్ ప్రయాణీకులకు మరియు విమానాశ్రయ సిబ్బంది కోసం 24 గంటలూ పని చేస్తుంది. ప్రయాణీకులు ఇమ్మిగ్రేషన్ లెవల్ లేదా ఇంటెరిమ్ ఇంటర్నేషనల్ డిపార్చర్స్ టెర్మినల్ ముందుభాగంలో పరీక్ష సదుపాయం ఉంది. RT-PCR ఆధారిత పరీక్ష కోసం నమూనా సేకరణ కోసం Oropharyngeal swabs ఉపయోగిస్తారు. పరీక్ష ఫలితాలు 4-6 గంటల్లో ఇమెయిల్ మరియు వాట్సాప్ ద్వారా లభిస్తాయి. రిపోర్టు హార్డ్ కాపీ కూడా లభిస్తుంది. రిపోర్టును తీసుకోవడానికి వేచి ఉండాల్సిన ప్రయాణీకుల కోసం ఒక లాంజ్ కూడా ఏర్పాటు చేసారు.
SGK కిషోర్, ED సౌత్ మరియు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్, GMR ఎయిర్ పోర్ట్స్ మాట్లాడుతూ, " ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు నెగిటివ్ COVID రిపోర్టును కలిగి ఉన్న ప్రయాణికులను తమ దేశంలోకి అనుమతిస్తున్న నేపథ్యంలో, విమానాశ్రయాలలో COVID పరీక్షా కేంద్రాలు విమాన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మేము మ్యాప్‌మైజెనోమ్ తో కలిసి ఈ COVID పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించాము. ఇది ప్రయాణీకులకు అత్యంత ఖచ్చితమైన మరియు విస్తృతంగా ఆమోదించబడిన RT-PCR రిపోర్టులు పొందడాన్ని సులభతరం చేస్తుంది. కోవిడ్ కేసులను తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కూడా మేము అభినందిస్తున్నాము. మన రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలను పున: ప్రారంభమై, ఇది మళ్లీ ప్రయాణాన్ని ప్రారంభించడానికి ప్రజలలో విశ్వాసం కలిగించడానికి సహాయపడుతుంది" అన్నారు.
మ్యాప్‌మైజెనోమ్ సీఈఓ మిస్ అను ఆచార్య మాట్లాడుతూ “కస్టమర్ల అనుభవం విషయంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్ భారతదేశంలోని అగ్రశ్రేణి విమానాశ్రయాలలో ఒకటి. మా COVID పరీక్ష ప్రయోగశాల దీన్ని మరింత ఉన్నతస్థాయికి తీసుకువెళుతుంది. తరచూ ప్రయాణించే నేను, విమానాశ్రయ ప్రాంగణంలో ల్యాబ్ అవసరాన్ని అర్థం చేసుకున్నాను. తెలంగాణలో COVID పరీక్షను అందించిన మొట్టమొదటి ప్రైవేట్ ల్యాబ్ నుండి పొందిన అనుభవాన్ని ఉపయోగించి, మేము ఇప్పుడు ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడానికి మా నిపుణుల బృందంతో కలిసి పని చేస్తున్నాము. ” అన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష