కోవిడ్ 19: అబుధాబికి వచ్చే ప్రయాణికులకు కొత్త మార్గనిర్దేకాలు జారీ

- November 04, 2020 , by Maagulf
కోవిడ్ 19: అబుధాబికి వచ్చే ప్రయాణికులకు కొత్త మార్గనిర్దేకాలు జారీ

అబుధాబి:అబుధాబికి వచ్చే ప్రయాణికులకు కొత్త నిబంధనలు జారీ అయ్యాయి. అబుధాబి మీదుగా యూఏఈకి చేరుకునే పౌరులు, ప్రవాసీయులతో పాటు అబుధాబి నివాసితులు సైతం కోవిడ్ టెస్ట్ చేయించుకున్న 48 గంటల్లో అబుధాబి చేరుకోవాలని అబుధాబి కోవిడ్ 19 అత్యవసర, విపత్తుల నిర్వహణ కమిటీ స్పష్టం చేసింది. పీసీఆర్ టెస్ట్ చేయించుకోని వారు డీపీఐ లేసేర్ టెస్ట్ రిపోర్ట్ ను తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. అంతేకాదు..అబుధాబిలో నాలుగు రోజులు ఉండే వారు తప్పనిసరిగా నాలుగో రోజున పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. అబుధాబిలో అడుగుపెట్టిన రోజును తొలి రోజుగా పరిగణిస్తారు. అంటే ఆదివారం అబుధాబికి చేరుకుంటే బుధవారం రోజున పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎనిమిది రోజులకు మించి అబుధాబిలో ఉంటే 8వ రోజున కూడా మరోసారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవటం తప్పనిసరి. అంటే 8 రోజుల వ్యవధిలో రెండుసార్లు టెస్ట్ చేయించుకోవాల్సిందేనని కమిటీ తమ కొత్త నిబంధనల్లో సూచించింది. 

--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com