ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- September 22, 2025
యూఏఈ: ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారిపై యూఏఈ కఠిన చర్యలు తీసుకుంది. యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ 14 దేశాలలో ఆన్లైన్ పిల్లల లైంగిక దోపిడీకి వ్యతిరేకంగా అంతర్జాతీయ ఆపరేషన్‌కు నాయకత్వం వహించింది. ఈ సందర్భంగా 188 మందిని అరెస్టు చేశారు. యూఏఈ ఆధ్వర్యంలో రష్యా, ఇండోనేషియా, బెలారస్, సెర్బియా, కొలంబియా, థాయిలాండ్, నేపాల్, పెరూ, బ్రెజిల్, ఫిలిప్పీన్స్, కిర్గిజ్స్తాన్, ఈక్వెడార్, మాల్దీవులు మరియు ఉజ్బెకిస్తాన్‌లలో స్పెషల్ ఆపరేషన్ జరిగింది.
ఆన్లైన్లో పిల్లల లైంగిక దోపిడీ నేరాలను ఎదుర్కోవడం ఈ ఆపరేషన్ లక్ష్యం. ఇది గణనీయమైన ఫలితాలను ఇచ్చింది. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుండి 165 మంది పిల్లలను రక్షించారు. మొత్తం 28 క్రిమినల్ నెట్‌వర్క్‌లను నిర్వీర్యం చేసినట్లు మంత్రి సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!
- యూఏఈ లాటరీ.. ఓ విజేతకు Dh5 మిలియన్ భారీ బహుమతి..!!
- హవల్లీ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. అజ్మాన్ ఫిలిప్పీన్స్ ప్రవాసికి Dh20 మిలియన్ జాక్‌పాట్..!!
- బహ్రెయిన్ విమానాశ్రయం వెనుక మాంగ్రూవ్ బెల్ట్..!!
- కువైట్ విమానాశ్రయంలో ట్రాన్సిట్ కార్యకలాపాలు నిలిపివేత యధాతథం..!!
- సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కేరళ నర్సులు సహా ఐదుగురు మృతి
- కాక్‌పిట్ పై దాడి.. ‘చివరి పోరాటం’తో వందల ప్రాణాలు కాపాడిన ఫ్లై దుబాయ్ పైలట్







