ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌కి చార్జింగ్‌: యూనిక్‌ సర్వీస్‌ అందిస్తున్న పోలీస్‌ స్టేషన్‌

- November 06, 2020 , by Maagulf
ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌కి చార్జింగ్‌: యూనిక్‌ సర్వీస్‌ అందిస్తున్న పోలీస్‌ స్టేషన్‌

అజ్మన్‌: మోటరిస్టులు, తమ ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్‌ని అల్‌ నుయైమియాహ్‌ కాంప్రహెన్సివ్‌ పోలీస్‌ స్టేషన్‌ - అజ్మన్‌లోని ప్రత్యేకంగా కేటాయించిన ప్రాంతంలో పొందవచ్చు. ఈ విషయాన్ని అజ్మన్‌ పోలీస్‌ వెల్లడించింది. గ్రీన్‌ డెవలప్‌మెంట్‌ పట్ల యూఏఈ కమిట్‌మెంట్‌కి ఇది నిదర్శనమని, గ్రీన్‌ ఎకానమీ దిశగా తమవంతు పాత్ర అజ్మన్‌ గవర్నమెంట్‌ పోషిస్తోందని అధికారులు పేర్కొన్నారు. నుమైమియాహ్‌ కాంప్రహెన్సివ్‌ ఓలీస్‌ స్టేషన్‌ హెడ్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ మొహమ్మద్‌ అబ్దుల్లా అబు షిహాబ్‌ మాట్లాడుతూ, ‘వన్‌ అవర్‌’ ఇనీషియేటివ్‌లో భాగంగా ఎలక్ట్రిక్‌ కారు ఓనర్లకు ఈ ఛార్జింగ్‌ డివైజ్‌ సౌకర్యాల్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎలక్ట్రిక్‌ వాహనాల ఉపయోగం పట్ల చైతన్యం పెంచేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com