లంక ప్రీమియర్ లీగ్.. మరో 'సారీ'

- November 07, 2020 , by Maagulf
లంక ప్రీమియర్ లీగ్.. మరో \'సారీ\'

కొలంబో:ఈ ఏడాది శ్రీలంక క్రికెట్ బోర్డు లంక ప్రీమియర్ లీగ్ ను పెద్ద ఎత్తున నిర్వహించాలని అనుకుంటూ ఉంది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున స్టార్ ప్లేయర్స్ ను టోర్నమెంట్ లో తీసుకోవాలని భావించింది. ప్లేయర్లు కూడా అందుబాటులోకి వస్తామని చెప్పారు. క్రిస్ గేల్, షాహిద్ అఫ్రీది, డూప్లెసిస్ లాంటి స్టార్స్ ఈ టోర్నీలో ఆడడానికి సముఖత వ్యక్తం చేశారు. కానీ నిర్వాహకులు మాత్రం లీగ్ ను మొదలు పెట్టడానికే చాలా సమయం తీసుకునేలా కనిపిస్తూ ఉన్నారు. ఇప్పటికే పలు మార్లు టోర్నమెంట్ వాయిదా పడగా.. మరోసారి కూడా వాయిదా వేస్తున్నామని నిర్వాహకులు స్పష్టం చేశారు. 

‌ శ్రీలంకలో కరోనా వైరస్‌ కేసులు నమోదవుతుండటంతో లంక ప్రీమియర్‌ లీగ్ ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీలంక క్రికెట్‌ (ఎస్‌ఎల్‌సీ) శుక్రవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఆగష్టు నెలలో టోర్నమెంట్ నిర్వహించాలని అనుకోగా.. నవంబర్‌ 14కు వాయిదా పడింది.. ఆ తర్వాత నవంబర్ 21కు వాయిదా పడింది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఆరు రోజులు ఆలస్యంగా నవంబర్‌ 27న మొదలు కానుంది.

ఈ టోర్నీని మూడు వేదికల్లో జరపాలని భావించినా... కరోనా నేపథ్యంలో టోర్నీలో జరిగే మొత్తం 23 మ్యాచ్‌లను ఒకే వేదికలో నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నట్లు ఎస్‌ఎల్‌సీ పేర్కొంది. హంబన్‌టోట లో టోర్నమెంట్ మొత్తం పూర్తీ చేయనున్నారు. డిసెంబర్‌ 17న ఫైనల్‌ జరగనుంది. ఆటగాళ్లకు విధించే  క్వారంటైన్‌ను 14 రోజుల నుంచి 7 రోజులకు కుదించేందుకు శ్రీలంక ఆరోగ్య శాఖ అధికారులు అంగీకరించారు. జట్ల సహాయక సిబ్బంది మాత్రం 14 రోజుల క్వారంటైన్‌ను పూర్తి చేయాలి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com