పీఎస్ఎల్వీ సి-49 ప్రయోగం విజయవంతం
- November 07, 2020
నెల్లూరు: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి పీఎస్ఎల్వీ సి-49 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. పీఎస్ఎల్వీ సి-49 వాహకనౌక ద్వారా 10 ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. భారత్‌కు చెందిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈవోఎస్-01) సహా మరో 9 విదేశీ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. భారత్‌కు చెందిన ఉపగ్రహం ఈవోఎస్-01 వ్యవసాయం, ప్రకృతి వైపరీత్యాలపై అధ్యయనం చేయనుంది. పీఎస్ఎల్వీ సి-49 ప్రయోగం విజయవంతంపై ఇస్రో ఛైర్మన్ శివన్ హర్షం వ్యక్తం చేశారు. ప్రయోగం సఫలీకృతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు.
అంతకుముందు పీఎస్ఎల్వీ సి-49 ప్రయోగం 10 నిమిషాలు వాయిదా పడింది. రాకెట్ ప్రయోగానికి షార్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా భారీ వర్షం కారణంగా ప్రయోగం ఆలస్యం అయింది. మొదటగా 3:02 నిమిషాలకు ప్రయోగించాలని భావించిన శాస్త్రవేత్తలు పది నిమిషాలు ఆలస్యంగా 3:12కు రాకెట్ ప్రయోగించారు.
తాజా వార్తలు
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్‌తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!







